OG movie shooting : వచ్చే వారం నుండి మొదలు కానున్న ‘ఓజీ’ షూటింగ్..సోషల్ మీడియా షాక్ అయ్యే అప్డేట్ ఇచ్చిన టీం!

పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. నేడు నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్, వచ్చే వారం నుండి షూటింగ్ పనులు ప్రారంభించుకోమని చెప్పినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా హీరోయిన్ ప్రియాంక మోహన్ మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట.

Written By: Vicky, Updated On : August 23, 2024 8:46 am

OG movie shooting

Follow us on

Oji movie shooting : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ’. చాలా కాలం తర్వాత కేవలం అభిమానుల్లోనే కాకుండా, ప్రేక్షకుల్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి విపరీతమైన హైప్ రావడం దీనికే జరిగింది. ఎందుకంటే ఆయన గత మూడు చిత్రాలు రీమేక్స్ కావడం , ఆ సినిమాల కథ, స్క్రీన్ ప్లే ముందుగానే తెలియడం వల్ల ప్రేక్షకుల్లో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ గత మూడు సినిమాలకు ఉండేది కాదు. కానీ ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టు యాక్షన్ సినిమా చేస్తుండడంతో చిన్న పిల్లల దగ్గర నుండి, పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వడం, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తుండడం వల్ల ఈ సినిమా షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చాయి. అయితే నేడు ఈ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య, డైరెక్టర్ సుజిత్ తో కలిసి పవన్ కళ్యాణ్ ని అమరావతిలోని సచివాలయం లో కలిసి డేట్స్ గురించి చర్చలు జరిపారు. దానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ లో డీవీవీ దానయ్య అకౌంట్ నుండి పోస్టులు పడ్డాయి. ఆ తర్వాత సోషల్ మీడియా మొత్తం ఓజీ మేనియా తో ఊగిపోయింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. నేడు నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్, వచ్చే వారం నుండి షూటింగ్ పనులు ప్రారంభించుకోమని చెప్పినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా హీరోయిన్ ప్రియాంక మోహన్ మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట.

పవన్ కళ్యాణ్ రెగ్యులర్ షూటింగ్ మొదలైన రెండు రోజుల తర్వాత సెట్స్ లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోని విడుదల చేసారు. దీనికి ఏ స్థాయి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 2 వ తేదీ కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చెయ్యనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే సెప్టెంబర్ 2 వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారట. వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.