https://oktelugu.com/

Hanuman Movie 3D version : విడుదలకు సిద్దమైన ‘హనుమాన్’ 3D వెర్షన్..అంతర్జాతీయ విలువలతో హాలీవుడ్ సినిమాలను మరిపించబోతుందట!

హనుమాన్ చిత్రాన్ని 3D వెర్షన్ లోకి మార్చి త్వరలోనే థియేటర్స్ లో మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తామని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇది వరకే ఒకసారి మీడియా కి తెలిపాడు. నేడు ఆయన దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ 'అక్టోబర్ లో మా చిత్రాన్ని గ్రాండ్ గా మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నాం. 3D టెక్నాలజీ తో సరికొత్త స్టాండర్డ్స్ ని వాడాము. ఔట్పుట్ అదిరిపోయింది

Written By:
  • Vicky
  • , Updated On : August 23, 2024 9:10 am
    Hanuman Movie 3D version

    Hanuman Movie 3D version

    Follow us on

    Hanuman 3D version : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ నుండి ట్రేడ్ పండితులు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. కేవలం రెండు సినిమాల అనుభవం కూడా సరిగా లేని ఒక కుర్ర హీరో 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడమా, ఇదెలా సాధ్యం అని ఇప్పటికీ ఆశ్చర్యంలోనే ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్నది స్టార్ హీరోల ట్రెండ్ కాదని, కేవలం కంటెంట్, క్వాలిటీ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారని ఈ చిత్రంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల దాటికి చిన్న సినిమాలు తట్టుకోలేవు. కానీ హనుమాన్ లాంటి చిన్న సినిమా, ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఓడించిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ప్రస్తుత పరిస్థితి.

    అయితే ఈ చిత్రాన్ని 3D వెర్షన్ లోకి మార్చి త్వరలోనే థియేటర్స్ లో మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తామని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇది వరకే ఒకసారి మీడియా కి తెలిపాడు. నేడు ఆయన దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘అక్టోబర్ లో మా చిత్రాన్ని గ్రాండ్ గా మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నాం. 3D టెక్నాలజీ తో సరికొత్త స్టాండర్డ్స్ ని వాడాము. ఔట్పుట్ అదిరిపోయింది, ఆడియన్స్ అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి పొందుతారు. ఈ సినిమాని 3D లోకి మార్చడానికి ప్రధాన కారణం, జపాన్ లో గ్రాండ్ గా విడుదల చేసే ప్లాన్ ఉండడం వల్లే. జపాన్ తో పాటుగా అక్టోబర్ లో ఇండియాలో 3D ఫార్మాట్ ఉన్న థియేటర్స్ లో విడుదల చేస్తాము. అనేక అంతర్జాతీయ సినిమాలు 3D లోకి కొన్ని సంవత్సరాల తర్వాత మార్చబడి రీ రిలీజ్ అయ్యాయి. అవి అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. మా ‘హనుమాన్’ చిత్రం కూడా అలంటికి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుంది అనే నమ్మకం ఉంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

    జపాన్ లో #RRR చిత్రం సంవత్సరం రోజులకు పైగా ప్రదర్శితమై 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. #RRR కారణంగా ఇండియన్ సినిమాకి జపాన్ లో కూడా మార్కెట్ గొప్పగా ప్రారంభమైంది. కాబట్టి హనుమాన్ చిత్రం రీ రిలీజ్ కి మంచి వసూలు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ని తెరకెక్కించబోతున్నట్టు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇది వరకే అధికారిక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదు అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. దీనికి సంబంధించ్చిన స్క్రిప్ట్ వర్క్ పై ప్రస్తుతం ఆయన పూర్తి స్థాయి ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.