Salaar Movie Story
Salaar Movie Story: ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ‘సలార్’ సినిమా పైనే. ఎందుకంటే బాహుబలి సిరీస్ తర్వాత ఆయన నుండి మూడు సినిమాలు విడుదల అయితే మూడు చిత్రాలు కూడా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం ఫ్లాప్ అవ్వడమే కాకుండా ప్రభాస్ కి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. రామాయణం ని అపహాస్యం చేసినట్టు గా నార్త్ ఇండియన్స్ మొత్తం ప్రభాస్ పై తీవ్రమైన కోపం తో ఉన్నారు.
దీంతో ఎలా అయినా ఇప్పుడు ప్రభాస్ ‘సలార్’ తో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవాలి, అందుకే ఈ సినిమా మీ ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్ననే ఈ సినిమాకి సంబంధించి కౌంట్ డౌన్ పోస్టర్ ని విడుదల చేసారు, సరిగ్గా 100 రోజులు ఉన్నాయంటూ అభిమానులకు ఒకసారి గుర్తు చేసారు.
ఇది ఇలా ఉండగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన సినిమాలలో కచ్చితంగా ఎదో ఒక సెంటిమెంట్ ని పెడుతూ రావడం ఆయనకీ బాగా అలవాటు, KGF సిరీస్ లో తల్లి సెంటిమెంట్ ని పెట్టి ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు. ఇప్పుడు ‘సలార్’ చిత్రం లో ఫ్రెండ్ షిప్ సెంటిమెంట్ ని పెట్టబోతున్నాడట. స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చే స్నేహితులను చాలా మందిని చూసుంటారు, కానీ స్నేహం కోసం ప్రాణాలను తీసే మనుషులను మాత్రం ఎక్కడా చూసి ఉండరు.
అలా ఒక సాధారణ మెకానిక్ గా జీవితాన్ని గడిపే ఒక యువకుడు, ప్రపంచం లోనే మోస్ట్ వియోలెంట్ మ్యాన్ గా ఎలా మారిపోయాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్ అట. KGF లో హీరో కి చూపించిన ఎలివేషన్ సన్నివేశాలు కేవలం టీజర్ మాత్రమేనట, అసలు సినిమా ‘సలార్’ అట. యాక్షన్ మూవీ లవర్స్ మెంటలెక్కిపొయ్యే రేంజ్ లో, ప్రభాస్ అభిమానుల ఆకలి మొత్తం తీరేవిధంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం, చూడాలి మరి.