Bigg Boss Telugu 8: నిన్న మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ ని హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారని బయట చూసే ఆడియన్స్ లో చాలామందికి అనిపించింది. అలాగే మణికంఠ ఆడే డ్రామాలను పసిగట్టిన ఆడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆడియన్స్ కంటే ఎక్కువగా హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి మణికంఠ గేమ్ ప్లాన్ మొత్తం అర్థమైంది. అతనికి సానుభూతి బయట జనాల్లో బలంగా వెళ్తుంది, దాని వల్లనే అతను ప్రతీ వారం నామినేషన్స్ నుండి సేవ్ అవుతున్నారు అనే విషయాన్నీ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ రాక ముందే పసిగట్టేసారు. దానికి తగ్గట్టుగా పాత కంటెస్టెంట్స్ అందరూ ఇప్పుడు మణికంఠ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ప్రతీ చిన్న విషయానికి డ్రామాలు చేయడం, కెమెరాలను తనవైపుకు ఫోకస్ అయ్యేలా చేసుకోవడం మణికంఠకు వెన్నతో పెట్టిన విద్య. ఇందుకే అతనంటే హౌస్ ఎవరికీ ఇష్టం లేదు, నామినేషన్స్ వేయడానికి బోలెడన్ని కారణాలు ఇచ్చాడు కాబట్టే హౌస్ మేట్స్ అందరూ అతనిని ఎక్కువ ఎంచుకుంటారు. అలాగే టాస్కులో మణికంఠ చాలా వీక్, అందుకే ప్రతీ టాస్క్ లో అతనిని పక్కన పెడుతారు. ఇక చీఫ్ అయ్యేందుకు అయితే మణికంఠ అసలు పనికిరాడు, ఈ విషయాన్ని హౌస్ లోకి కొత్తగా అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్స్ కూడా చెప్పుకొచ్చారు. ఒక డ్రామాలు ఆడడంలో తప్ప మణికంఠ అన్నిట్లో వీక్ కాబట్టే హౌస్ మేట్స్ అతనిని ఎక్కువగా ఎంచుకుంటారు. ఇది కావాలని టార్గెట్ చేసినది కాదు, కానీ అతనికి బయట ఒక సెక్షన్ ఆడియన్స్ కి టార్గెట్ చేసినట్టుగా అనిపించింది, అందుకే అతనికి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే ఈ వారం అతనికి సానుభూతి పొందే స్కోప్ ఒక్కటి కూడా ఇవ్వలేదు కంటెస్టెంట్స్. వైల్డ్ కార్డ్స్ లో టేస్టీ తేజా తప్ప ఎవ్వరూ మణికంఠ ని ముట్టుకోలేదు, అలాగే అతనికి ఈ వారం గేమ్స్ ఆడే అవకాశాన్ని ఇచ్చారు ఓజీ క్లాన్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మణికంఠ ని చీఫ్ అయ్యేందుకు ఓజీ క్లాన్ సభ్యులు మొత్తం ఏకపక్షంగా ఒక తాటి మీదకు వచ్చి సపోర్టు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మణికంఠ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా మారిపోయాడు, పాత మణికంఠ మళ్ళీ బయటకు వచ్చి అతని అసలు రంగు జనాలకు తెలియాలంటే కచ్చితంగా చీఫ్ అవ్వాలి, నేను మణికంఠ చీఫ్ అయ్యేందుకు సపోర్ట్ చేస్తా అంటూ యష్మీ అంటుంది, నిఖిల్ కి ఇదే ఆలోచనని మెహబూబ్ కి చెప్తాడు. ఇలా అందరూ మణికంఠ ని చీఫ్ అయ్యేందుకు సహకరించడానికి ముఖ్య కారణం ఇదే, అంతే కానీ అతని మీద జాలి పడి మాత్రం కాదు అనేది నిన్నటి ఎపిసోడ్ చూసిన వారికి అర్థమైంది. ఇందులో తప్పేమి లేదు, మణికంఠ కంటెస్టెంట్స్ తో మైండ్ గేమ్ ఆడుతున్నాడు, కంటెస్టెంట్స్ కూడా అతన్ని మైండ్ గేమ్ తోనే అరికట్టాలని చూస్తున్నారు అని సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు.