https://oktelugu.com/

Devmali Rajasthan: ఆ ఊళ్లో ఇళ్లకు తాళాలు వేయరు.. భవనాలు నిర్మించరు.. ఎక్కడుందో తెలిస్తే షాక్ అవుతారు..

దేశంలో అత్యధిక ఎడారి ప్రాంతం ఉన్న రాజస్థాన్ రాష్ట్రం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది గ్రామాల్లోనే ఎక్కువగా జీవిస్తారు. అంతేకాకుండా వీరి జీవన విధానం మిగతా వారి కంటే భిన్నంగా ఉంటుంది. తాజాగా ఈ రాష్ట్రంలోని ఓ గ్రామం గురించి ask_bhai9 అనే ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో వీడియో అప్లోడ్ అయింది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 12, 2024 / 07:00 AM IST

    Devmali Rajasthan

    Follow us on

    Devmali Rajasthan: భారతేశానికి గ్రామాలు వెన్నెముక లాంటివి. ఇక్కడ అధికంగా గ్రామాలే ఉన్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ప్రపంచంతో భారత్ పోటీ పడుతున్నా.. కొందరు గ్రామంలోనే నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారు. గ్రామీణులు అంతా కలిసి మెలిసి ఉంటారు. అలాగే ఒకరికి ఒకరు సాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దేశం ప్రజలు ఎక్కువగా ఆధారపడిన ఆహార ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. ఆహార ఉత్పత్తులు చేసే ప్రజలు గ్రామాల్లోనే ఎక్కువగా ఉండడంతో చాలా గ్రామాలు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే కొన్ని గ్రామాలు పట్టణాలతో పోటీ పడి అభివృద్ధి చెందుతున్నాయి. నగరాలకు ధీటుగా పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నాయి. కొందరు ఇప్పటి వరకు ఉన్న పెంకుటిళ్లను తీసేసి భవనాలు నిర్మించుకుంటున్నారు. అయితే దేశంలో ఓ గ్రామం మాత్రం సాదాసీదాగా ఉంటోంది. అయితే ఈ గ్రామం గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. ఎందుకంటే?

    దేశంలో అత్యధిక ఎడారి ప్రాంతం ఉన్న రాజస్థాన్ రాష్ట్రం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది గ్రామాల్లోనే ఎక్కువగా జీవిస్తారు. అంతేకాకుండా వీరి జీవన విధానం మిగతా వారి కంటే భిన్నంగా ఉంటుంది. తాజాగా ఈ రాష్ట్రంలోని ఓ గ్రామం గురించి ask_bhai9 అనే ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో వీడియో అప్లోడ్ అయింది. ఈ వీడియోను 5 కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇంతలా ఈ గ్రామంలో ఏముంది? అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే ఇన్నివ్యూస్ రావడానికి పెద్ద కారణమే ఉంది. అదేంటంటే?

    రాజస్థాన్ లోని బేవార్ జిల్లాలోదేవమాలి అనే గ్రామం ఉంది. ఇప్పుడీ గ్రామం గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. ముందుగా ఇక్కడి ఇళ్ల గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంటికి మట్టి గోడ, పెంకుటిల్లు ఉంటాయి. అయితే ఇవి పేదవారివి అనుకోవచ్చు. కానీ అదేం కాదు. పేద వారి నుంచి ధనికులు సైతం ఈ గ్రామంలో ఇలాగే నిర్మించుకోవాలి. సమానత్వం అనే భావన రావడానికి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఈ గ్రామంలోని వారంతా శాఖాహరులే. ఎలాంటి మాంసం, మద్యం ముట్టుకోరు. అలాగే ఇక్కడ ఉన్నవారు తమ ఇళ్లకు అస్సలే తాళాలు వేయరు. ఏ ఇల్లు చూసినా తలుపు తెరిచే ఉంటుంది.

    ఈ గ్రామస్తులంతా గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన వారు దీంతో వీరు దేవ నారాయణుడి పూజిస్తారు. ఈ గడి కూడా సాదాసీదాగా నిర్మించారు. దేవనారాయణుడి అనుగ్రహంతో ఈ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని భావిస్తారు. అలాగే తమ ఇళ్లను కాపాడుతూ, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూస్తాడని అంటారు. అందుకే చాలా మంది ఎలాంటి భేదాలు లేకుండా కలిసి మెలిసి ఉంటారు. ఈ గ్రామం గురించి తెలిసిన చాలా మంది ఇక్కడికి వస్తూ పోతున్నారు. కొందరు ఈ గ్రామంలోని ప్రజలతో కలిసి మెలిసి ఉంటున్నారు. ఈనేపథ్యంలో దేవమాలి గ్రామం గురించి మీడియాలో రావడంతో చాలా మంది సోషల్ మీడియాలో దీని గురించి తెలుపుతున్నారు. అయితే ముందుగా పోస్టు చేసిన వీడియోకు 5 కోట్ల వ్యూస్ రావడం విశేషం.