https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఓటింగ్ ముగిసింది..దూసుకొచ్చిన యష్మీ..డేంజర్ జోన్ లో ఏకంగా ముగ్గురు..బిగ్ బాస్ హిస్టరీలో ఇదే తొలిసారి!

బిగ్ బాస్ సీజన్ 6వ వారానికి సంబంధించిన ఓటింగ్ నిన్న అర్థ రాత్రి 12 గంటలకు ముగిసింది. ఇప్పటి వరకు 5 వారాలకు గానూ బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, నైనికా మరియు ఆదిత్య ఓం వంటి వారు ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు ఓజీ క్లాన్ నుండి విష్ణు ప్రియ, యష్మీ, సీత మరియు పృథ్వీ నామినేట్ అవ్వగా, రాయల్ క్లాన్ నుండి గంగవ్వ, మెహబూబ్ నామినేట్ అయ్యారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 12, 2024 / 07:23 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 6వ వారానికి సంబంధించిన ఓటింగ్ నిన్న అర్థ రాత్రి 12 గంటలకు ముగిసింది. ఇప్పటి వరకు 5 వారాలకు గానూ బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, నైనికా మరియు ఆదిత్య ఓం వంటి వారు ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు ఓజీ క్లాన్ నుండి విష్ణు ప్రియ, యష్మీ, సీత మరియు పృథ్వీ నామినేట్ అవ్వగా, రాయల్ క్లాన్ నుండి గంగవ్వ, మెహబూబ్ నామినేట్ అయ్యారు. నిన్న ఓటింగ్ ముగిసే సమయానికి ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారు?, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. యూట్యూబ్ లో మణికంఠ పీఆర్ టీం కి సంబంధించిన వాళ్ళు బిగ్ బాస్ ప్రోమో విడుదలైనప్పుడల్లా యష్మీ ‘ఎలిమినేషన్ బటన్’ అని కామెంట్స్ లో పెట్టడం, దానికి వేల సంఖ్యలో లైక్స్ రావడం వంటివి చూసి చాలా మంది యష్మీ ఎలిమినేట్ అయిపొతుందెమో అని అనుకున్నారు.

    అలా అనుకున్నవారికి ఈ వారం ఆమెకి పడిన ఓటింగ్ ని చూసి కంగుతినే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జనాలు యష్మీ ని బాగా అర్థం చేసుకున్నారు. టాస్క్ వచ్చినప్పుడు నూటికి నూరు శాతం తన వైపు నుండి బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది, ముందు ఒక మాట, వెనుక ఒక మాట కాకుండా ఒకే అభిప్రాయం తో తన తోటి కంటెస్టెంట్స్ తో ఉండడం, ఎలాంటి మాస్క్ లేకుండా కోపం వస్తే కోపం చూపించడం, ప్రేమ వస్తే ప్రేమ చూపించడం వంటివి జనాలు బాగా గమనించారు. అందుకే ఆమెకి ఓట్లు భారీ గా గుద్దేశారు. ఈ వారం ఓటింగ్ లో ఆమె విష్ణు ప్రియ ని వెనక్కి నెట్టి టాప్ 3 స్థానం లో నిల్చింది. అలాగే మొదటి స్థానం లో గంగవ్వ అందరికంటే టాప్ మార్జిన్ తో కొనసాగుతుండగా, రెండవ స్థానంలో మెహబూబ్ నిలిచాడు. ఇక విష్ణు ప్రియ ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ప్రారంభంలో రెండవ స్థానంలో ఉండేది, కానీ ఇప్పుడు నాల్గవ స్థానానికి పడిపోయింది.

    ఇక చివరి రెండు స్థానాల్లో పృథ్వీ, సీత కొనసాగుతున్నారు. పృథ్వీ కి, సీత కి మధ్య చాలా ఓట్ల మార్జిన్ ఉంది. కాబట్టి సీత ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతుంది. మొదటి రెండు వారాల్లో సీత గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేది. నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా టాప్ 3 స్థానాల్లో ఎదో ఒక స్థానం లో ఉండేది. కానీ ఈమధ్యనే ఆమె మాస్క్ తీసి ఆడుతుంది, ఆమెలో గేమ్ తగ్గిపోయి, నెగటివ్ యాంగిల్స్ చాలా వరకు బయటపడుతున్నాయి, అందుకే ఓటింగ్ ఈ స్థాయిలో పడిపోయింది. అయితే ఈరోజు దసరా కాబట్టి ఎలిమినేషన్ లేకపోయే అవకాశం కూడా ఉందని అంటున్నారు,అదే కనుక జరిగితే సీత లాంటి లక్కీ కంటెస్టెంట్ మరొకరు లేరు అనొచ్చు.

    Tags