Pushpa Song: సిద్ శ్రీరామ్.. ఏఆర్ రెహమాన్ పరిచయం చేసి ఈ గాయకుడు పాడిన పాటలు దక్షిణాదిన ఓ ట్రెండ్ సెట్టర్… ప్రేమ పాటలు, విరహా గీతాలను సిద్ శ్రీరామ్ పాడాడంటే ఆ పాట శ్రోతల మనసు దోచాల్సిందే. అందుకే ఇతడిని సంగీత దర్శకులు తెగ వాడేస్తున్నారు. తెలుగులో అయితే ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్న ‘థమన్’ తన ఆస్తానా గాయకుడిగా మార్చేశాడు.

కొద్దిరోజులుగా ఈ సంగీత పోటీలో వెనుకబడిన టాలీవుడ్ సంచలన దర్శకుడు దేవీ శ్రీప్రసాద్.. ఎక్కువగా సిద్ శ్రీరామ్ తో పాటలు పాడించేవాడు కాదు.. తన గాయకులు వేరేవాళ్లు ఉండేవారు. ఇక ఈ మధ్య థమన్ తో పోటీపడలేకపోతున్న దేవీ శ్రీ తాజాగా పుష్ప సినిమాతో మరోసారి రేసులోకి వచ్చాడు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక’ అంటూ విడుదలైన పాట ఫుల్ పాపులర్ అయ్యింది. మాస్ ప్రేక్షకుల మనసు దోచేసింది.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న రష్మిక కోసం ‘శ్రీవల్లీ’ అంటూ ఓ పాటను వదిలారు. ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లీ’ అంటూ హీరో తన ప్రేమను వ్యక్తపరిచే ఆ పాటను సిద్ శ్రీరామ్ పాడి మరింత పైకి తీసుకెళ్లాడు. తాజాగా పుష్ప నుంచి విడుదలైన ఈ రెండోపాట ప్రేక్షకులను అలరిస్తోంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటలో అల్లు అర్జున్ చేయి విరిగి పట్టేసిన చేయితో చేసిన డ్యాన్స్ అలరిస్తోంది.
మొత్తానికి సుకుమార్ తన మార్క్ ను ఈ పాటలో చూపించాడు. శ్రావ్యంగా.. హృద్యంగా యానిమేషన్ తో వీడియో రూపొందించాడు. అల్లు అర్జున్ వేసిన ‘జోడు స్టెప్’ ఈ పాటలో హైలెట్ అనిచెప్పొచ్చు.
