Vishal: తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో హీరో విశాల్ ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపును పొంది… ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పందెం కోడి, పందెం కోడి 2, అభిమన్యు, డిటెక్టివ్ వంటి సినిమాలు తెలుగులో కూడా ఘన విజయం సాధించాయి. ఈ విధంగా తెలుగులో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో విశాల్. తెలుగు వాడైన విశాల్ తమిళ్ ఇండస్ట్రి లో రాణిస్తూ అగ్ర హీరోల్లో ఒకడిగా ఉండడం మంచి విషయం అని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు.
అయితే ఇప్పుడు తాజాగా రానా ప్రొడక్షన్స్ లో నూతన దర్శకుడు వినోత్ కుమార్ దర్శకత్వంలో… ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ లో విశాల్ కు జోడీగా హీరోయిన్ సునైనా నటిస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ 32 అనే పోస్టర్ ను చిత్రా బృందం విడుదల చేసింది. ఈ మూవీ లో సీనియర్ నటుడు ప్రభు … విశాల్‌తో మూడోసారి జతకట్టనున్నట్టు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది. ఈ పాత్రలో నటించడానికే నటుడు ప్రభు… బరువు తగ్గాడని కొందరు నటులు అనుకుంటున్నారు. మరో వైపు హీరో ఆర్య తో కలిసి ‘ఎనిమీ’ అనే సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.