https://oktelugu.com/

Priyanka Chopra : మహేష్,రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో బాహుబలి తీయొచ్చు!

ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని వదిలి వెళ్లి చాలా కాలమే అయ్యింది. ఆమె హాలీవుడ్ లో అనేక సినిమాలు చేస్తూ, విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ, అక్కడి ఆడియన్స్ కి ఫేవరేట్ ఆర్టిస్టుగా మారిపోయింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా గత పదేళ్ల నుండి ఆమె హాలీవుడ్ లో చక్రం తిప్పుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : January 25, 2025 / 10:01 PM IST
    Priyanka Chopra Remuneration

    Priyanka Chopra Remuneration

    Follow us on

    Priyanka Chopra : మహేష్, రాజమౌళి సినిమా రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధంగా ఉంది. ఈ నెల, లేదా వచ్చే నెల నుండి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో మొదటి షెడ్యూల్ మొదలు కానుంది. ఇప్పటికే ఆర్టిస్టులకు సంబంధించిన లుక్ టెస్టులు, వర్క్ షాపులు పూర్తి అయ్యాయి. ఎక్కడో న్యూ జెర్సీ లో ఉన్నటువంటి ప్రియాంక చోప్రా ని కేవలం లుక్ టెస్టులు చేయించడం కోసం హైదరాబాద్ కి రప్పించాడు రాజమౌళి. వివిధ కోణాల్లో ఈ చిత్రం లోని ఆమె పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్స్ ని చేసి, ఆమెని అధికారికంగా ఈ సినిమాలోకి తీసుకున్నారు. అయితే ప్రియాంక చోప్రా సాదాసీదా హీరోయిన్ కాదు. కేవలం బాలీవుడ్ హీరోయిన్ అయితే ఎన్ని డేట్స్ అయినా ఇవ్వగలదు. ఎందుకంటే మన టాలీవుడ్ ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ 1 ఇండస్ట్రీ కాబట్టి.

    కానీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని వదిలి వెళ్లి చాలా కాలమే అయ్యింది. ఆమె హాలీవుడ్ లో అనేక సినిమాలు చేస్తూ, విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ, అక్కడి ఆడియన్స్ కి ఫేవరేట్ ఆర్టిస్టుగా మారిపోయింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా గత పదేళ్ల నుండి ఆమె హాలీవుడ్ లో చక్రం తిప్పుతుంది. వెబ్ సిరీస్ లు కూడా అక్కడ చేస్తూ ఉంటుంది. ఆమె రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో చేసిన హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కోసం 5 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్ ని అందుకుంది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లోకి చూస్తే అక్షరాలా 45 కోట్ల రూపాయిలు అన్నమాట. అదే ఒక సినిమాలో పూర్తి స్థాయి రోల్ చేస్తే ఏకంగా 10 మిలియన్ డాలర్స్ కి పైగా రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది. అంటే 80 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ డబ్బులతో 7 ఏళ్ళ క్రితం మన టాలీవుడ్ లో బాహుబలి లాంటి సినిమాలను తీయొచ్చు.

    అంతటి రేంజ్ ఉన్న ప్రియాంక చోప్రా ని రాజమౌళి తన సినిమా కోసం ఒప్పించడం అనేది చిన్న విషయం కాదు. పైగా రెండేళ్ల డేట్స్ ని బల్క్ గా అడిగాడట రాజమౌళి. రెమ్యూనరేషన్ కేవలం పాతిక కోట్ల రూపాయిలు మాత్రమే. ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకి సంపాదించే రెమ్యూనరేషన్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది. పాన్ ఇండియా దాటి, పాన్ వరల్డ్ రేంజ్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న అంతర్జాతీయ చిత్రమిది. అంటే ప్రియాంక చోప్రా ఒక హాలీవుడ్ చిత్రం లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టే. ఇప్పటి వరకు ఆమెకు ఇంత పెద్ద హాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా చేసే అవకాశం అక్కడ రాలేదు. ఈ చిత్రం హిట్ అయితే హాలీవుడ్ లో ఆమె స్థాయి మరింత ఎత్తుకి ఎదిగే అవకాశం ఉంది. అందుకే తక్కువ రెమ్యూనరేషన్ కి ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందట.