https://oktelugu.com/

Aishwarya Rajesh : ఎప్పటికైనా  ఆ స్టార్ హీరోతో కలిసి సినిమా చేయడమే నా డ్రీం అంటూ ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు కేవలం కొన్ని మాత్రమే చేసింది. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ముందు ఆమె 'కౌశల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్ జగదీశ్', 'రిపబ్లిక్' వంటి తెలుగు సినిమాలు చేసింది. వీటిల్లో ఒక్కటి కూడా ఆమెకు కమర్షియల్ గా సక్సెస్ ని అందించలేదు. తెలుగు లో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ ఫుల్ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' మాత్రమే. ఈ చిత్రంలో వెంకటేష్ పక్కన ఆమెని చూసిన తర్వాత, ప్రతీ ఒక్కరు మహానటి సౌందర్య తో పోల్చి చూసుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 25, 2025 / 09:30 PM IST
    Aishwarya Rajesh

    Aishwarya Rajesh

    Follow us on

    Aishwarya Rajesh : సీనియర్ హీరో రాజేష్ కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాజేష్, తెలుగులో కంటే ఎక్కువగా తమిళం లోనే సినిమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తమిళం లో ఆమె ఇప్పటి వరకు 50 సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తే తెలుగు కేవలం కొన్ని మాత్రమే చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ముందు ఆమె ‘కౌశల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీశ్’, ‘రిపబ్లిక్’ వంటి తెలుగు సినిమాలు చేసింది. వీటిల్లో ఒక్కటి కూడా ఆమెకు కమర్షియల్ గా సక్సెస్ ని అందించలేదు. తెలుగు లో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ ఫుల్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రమే. ఈ చిత్రంలో వెంకటేష్ పక్కన ఆమెని చూసిన తర్వాత, ప్రతీ ఒక్కరు మహానటి సౌందర్య తో పోల్చి చూసుకున్నారు. అంతటి చక్కటి నటన ఆమె ఈ సినిమాలో కనబర్చిందని అందరూ పొగడ్తలతో ముంచి ఎత్తారు.

    ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈమె తనకి టాలీవుడ్ లో బాగా ఇష్టమైన హీరో, ఎవరితో కలిసి నటించాలి అనుకుంటుంది చెప్పేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలనేది ఆమె చిరకాల కోరిక అట. ఆమె మాట్లాడుతూ ‘నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి నటన అంటే చాలా ఇష్టం. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుండి ఆయన డ్యాన్స్, ఫైట్స్, యాక్టింగ్ ని అమితంగా ఆరాధిస్తూ వచ్చాను. ఆయన చిత్రంలో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను. భవిష్యత్తులో కచ్చితంగా ఆయనతో కలిసి సినిమా చేసే అదృష్టం వస్తుందని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. సాధారణంగా హీరోయిన్లు అవకాశాల కోసం తమకి ఇష్టమైన హీరోలు ఎవరు?, పలనా హీరో సినిమాలోనే నటించాలని బహిరంగంగా చెప్పరు. కానీ ఐశ్వర్య రాజేష్ సేఫ్ గేమ్స్ ఆడే అమ్మాయి కాదు. మనసులో ఏముంటుందో నిర్మొహమాటంగా బయటకి చెప్పేస్తుంది. అందులో భాగంగానే ఈ అంశంపై ఆమె స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది.

    ప్రస్తుతం ఆమె తమిళం లో మూడు సినిమాలు, కన్నడ లో ఒక సినిమా చేస్తుంది. తెలుగు లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆమెకి అవకాశాలు ఇక్కడ దండిగా వస్తున్నాయి. కానీ ఐశ్వర్య రాజేష్ అందరి లాంటి హీరోయిన్ కాదు. కొంతమంది హీరోయిన్లు స్టార్ హీరో సినిమాలో ఎలాంటి రోల్ ఇచ్చినా ముందు వెనుక చూసుకోకుండా డేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం, తర్వాత వాళ్ళు ఇండస్ట్రీ లో కనిపించకుండా పోవడం వంటివి జరుగుతుంటాయి. ఐశ్వర్య రాజేష్ తనకి అలాంటి పరిస్థితి రావాలని కోరుకోదు, అందుకే ఆమె కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. సౌత్ ఇండియా లో అన్ని భాషలను కవర్ చేస్తూ అగ్ర హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్న ఐశ్వర్య, భవిష్యత్తులో ఏ రేంజ్ కి వెళ్లబోతుందో చూడాలి.