Teja Sajja : ‘హనుమాన్'(Hanuman Movie) వంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటిస్తున్న చిత్రం మిరాయ్(Mirai |Movie). సినిమాటోగ్రాఫర్ గా పలు సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattameni) ‘ఈగల్’ తో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడినప్పటికీ కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ స్కిల్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా తర్వాత వెంటనే ఆయన ‘మిరాయ్’ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించడం అప్పట్లో హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ చిత్రం లో తేజ సజ్జ సూపర్ హీరో గా నటిస్తుండగా, మంచు మనోజ్(Manchu Manoj) సూపర్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు గ్లిమ్స్ వీడియోలు విడుదలై ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
తేజ సజ్జ మరోసారి భారీ బ్లాక్ బస్టర్ కొట్టడబోతున్నాడు అనే నమ్మకాన్ని ఇచ్చింది ఈ గ్లిమ్స్ వీడియోస్. క్వాలిటీ అయితే హాలీవుడ్ మూవీ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ని ఆగష్టు 1 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే బ్రాండ్ న్యూ పోస్టర్ ద్వారా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అయితే ఇదే నెలలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఆ సినిమాని మే 9న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యే పరిస్థితులు లేకపోవడం తో ఆగస్టు నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అది కూడా మొదటి వారం లోనే ఉంటుందని టాక్. ఇదే కనుక జరిగితే మెగాస్టార్ చిరంజీవి కే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే తేజ సజ్జ కి ఎంత ఓపెనింగ్ వచ్చినా పోయేదేమీ లేదు, కానీ చిరంజీవి సినిమాకి ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో రావాలంటే ఈ రెండు సినిమాలు క్లాష్ అవ్వకూడదు. పైగా ‘మిరాయ్’ చిత్రానికి పాజిటివ్ బజ్ ఉండగా, ‘విశ్వంభర’ చిత్రానికి గ్రాఫిక్స్ కారణంగా నెగటివ్ బజ్ ఉంది. టాక్ వస్తే కచ్చితంగా విశ్వంభర దుమ్ము లేపేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ టాక్ రాకపోతే మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమా తేజ సజ్జ సినిమా కంటే తక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. అదే కనుక జరిగితే చిరంజీవి అభిమానులు ఘోరమైన అవమానం ఎదురవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న హీరోల సినిమాలు, పెద్ద హీరోల సినిమాలకంటే బాగా ఆడుతున్నాయి. ఉదాహరణకి ఒకే రోజు విడుదలైన ‘హనుమాన్, ‘గుంటూరు కారం’ చిత్రాలలో హనుమాన్ చిత్రానికి ‘గుంటూరు కారం’ కంటే రెండు రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టింది. మళ్ళీ అలాంటి మ్యాజిక్ రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Mark the date.#MIRAI ~ , ❤️❤️❤️
The rise of #SuperYodha begins in theatres worldwide ⚔️
Get ready to witness a breathtaking action adventure on the big screen ❤️#MIRAIonAUGUST1st
SuperHero @tejasajja123
Rocking Star @HeroManoj1 @RitikaNayak_… pic.twitter.com/AXHpJKMjwE— People Media Factory (@peoplemediafcy) February 22, 2025