The Raja Saab Movie Tickets: ప్రభాస్ హీరోగా వస్తున్న ‘రాజాసాబ్’ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి…ఇక దర్శకుడు మారుతీ సైతం ఈ సినిమా ప్రమోషన్స్ ని భారీ రేంజ్ లో చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాతో తను ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది? సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందా లేదా అనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఇంకా బుక్ మై షో లో కానీ, డిస్ట్రిక్ట్ యాప్ లో గాని టికెట్స్ పెట్టలేదు. కారణం ఏంటి అంటే ఈ సినిమా టికెట్ రేట్లను హైక్ చేసుకుంటామంటూ వీళ్ళు కోర్టునైతే ఆశ్రయించారు. కానీ కోర్టులో వీళ్ళకు చేదు అనుభవం ఎదురైంది. దాంతో మరోసారి టికెట్ రేట్లను పెంచాలనే ఉద్దేశ్యంతో మరో ప్రయత్నం చేస్తున్నారు…
ఇక టిక్కెట్ల విషయంలో క్లారిటి వచ్చిన తర్వాతే ఈ సినిమాకు సంబంధించిన టిక్కెట్స్ ను ఆన్లైన్ లో పెడతాం అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక క్లారిటి అయితే వచ్చింది. ఇక ఈరోజు సాయంత్రం నుంచి ఈ సినిమా టిక్కెట్లు ఆన్లైన్లో అవైలబుల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి.
అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది…ఇక మొత్తానికైతే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందంటూ వాళ్ళ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ కి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి బీ,సీ సెంటర్లో అతని సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సినిమా ఎలా ఉన్నా కూడా మినిమం కలెక్షన్స్ ను రాబట్టే కెపాసిటీ ప్రభాస్ కైతే ఉంది. కాబట్టి ఈ సినిమాతో తను భారీ కలెక్షన్స్ ను కొల్లగొడతాడు అంటూ పలువురు సినిమా విమర్శకులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఇక సినిమాను ఆపే వారెవరు ఉండరు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…