Mana Shankara Vara Prasad Garu Budget: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 12వ తేదీన రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించే దిశగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా భాగం అవ్వడంతో ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో చిరంజీవి మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాకి అయిన బడ్జెట్ ఎంత? ఈ సినిమాకి ఎంత కలెక్షన్స్ వస్తే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లబోతోంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
ఈ సినిమా కోసం దాదాపు 160 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించారు… కాబట్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగిందనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక వీటన్నింటిని బట్టి చూస్తే ఈ సినిమా 170 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడితే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతోంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమా అందరిని అలరిస్తుందని మేకర్స్ పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చిరంజీవి సైతం ఈ సినిమాతో ఇప్పటివరకు రానటువంటి భారీ కలెక్షన్స్ ను కొల్లగొడతాననే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు…
అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు చిరంజీవిని ఏ రేంజ్ లో చూపించాడు. ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే విధంగా ఇందులో సన్నివేశాలు ఉన్నాయా? అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…