The Raja Saab: రాజాసాబ్ మోషన్ పోస్టర్ అనుకున్న రేంజ్ లో లేదా..?ఆ రెండు సినిమాలను కాపీ చేసి సినిమాను తీశారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ గుర్తింపు వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు...ఇక వన్ ఇయర్ గ్యాప్ లోనే రెండు భారీ సక్సెస్ లను అందుకున్నాడు...

Written By: Vicky, Updated On : October 23, 2024 4:24 pm

The Raja Saab(3)

Follow us on

The Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజసాబ్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ ని చూసిన చాలామంది చాలా కొత్తగా డిజైన్ చేశారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికైతే ఒక ఆకు నుంచి షార్ట్ ని ఓపెన్ చేసి చివర్లో ఒక కోటలో ప్రభాస్ చైర్ మీద కూర్చోని సిగర్ తాగుతూ కనిపిస్తాడు. నిజానికైతే వాళ్ళు తీసిన ఇంటెన్స్ అనేది ప్రేక్షకుల్లో హర్రర్ ని కల్పించే విధంగా ఉన్నప్పటికీ దాన్ని కొంచెం డీప్ గా అబ్జర్వ్ చేస్తే మాత్రం అది చంద్రముఖి ఫ్లేవర్ లోనే నడిచిందని చంద్రముఖికి దీనికి పెద్దగా తేడా లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక కోటను ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా చంద్రముఖి సినిమాలో లాగానే అనిపిస్తుంది. ఇంకొంతమంది అయితే ఇది చంద్రముఖి 2 గా వస్తుందా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే స్టోరీ మాత్రం మారుతి డైరెక్షన్ లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘ప్రేమ కథ చిత్రమ్’ సినిమాని బేస్ చేసుకొని అదే కథని మళ్లీ తీస్తున్నాడనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తానికైతే ప్రేమ కథ చిత్రమ్ కథని చంద్రముఖి స్టైల్ లో తీస్తున్నాడు అంటూ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి మొత్తానికైతే మారుతి ఈ సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు.

కానీ ఈ టీజర్ ని చూస్తే ఈ సినిమా అంత పెద్దగా వర్కౌట్ అయ్యే విధంగా అయితే కనిపించడం లేదు. ఎందుకంటే మోషన్ పోస్టర్ ను కూడా చాలా లో ఎఫర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సిన్సియర్ ఎఫెర్ట్స్ అయితే ఈ మోషన్ పోస్టర్ మీద పెట్టలేదు. ఏదో లో బడ్జెట్ లో మోషన్ పోస్టర్ ను చుట్టేసినట్టుగా కనిపిస్తోంది.

ప్రభాస్ ని రివిల్ చేసే షాట్ కూడా అంత ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఏమీ లేదు. ప్రభాస్ కూర్చున్న చైర్ అతనికి అసలు సరిపోలేదు. ఆ మోషన్ పోస్టర్ డిజైన్ చేసిన వాళ్ళకి కూడా ఇంత క్లారిటీ మిస్ అయిందనే చెప్పాలి. మొత్తానికైతే ప్రభాస్ రేంజ్ లో ఈ మోషన్ పోస్టర్ అయితే లేదు.

దానికి తగ్గట్టుగానే మారుతి చేసే రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలా మాదిరిగానే ఈ సినిమా కూడా ఉండబోతుందనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. మరి ప్రభాస్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా ఫెయిల్యూర్ గా మిగులుతాడా అనేది తెలియాల్సి ఉంది….