Homeలైఫ్ స్టైల్Partner will never leave you: ఈ రొమాంటిక్ పనులతో భాగస్వామి మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టదు..

Partner will never leave you: ఈ రొమాంటిక్ పనులతో భాగస్వామి మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టదు..

Partner will never leave you: ఇద్దరు తెలియని వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండడానికి వివాహం అనే బంధం ఏర్పాటు చేసుకుంటారు. ఈ బంధం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ఒకరి తప్పులు మరొకరు మన్నించుకుంటూ ముందుకు సాగుతారు. అయితే అన్నీ బాగున్నా.. కొందరు ప్రాక్టికల్ లైఫ్ ను మెయింటేన్ చేస్తారు. అంటే ఉదయం ఆఫీసుకు వెళ్లడం.. ఆ తరువాత ఇంటికి రాగానే నిద్రించడం.. వారంలో స్నేహితులతో కలిసి ఉండడం చేస్తారు. మరొకొందరు సాయంత్రం సమయంలో కొన్ని వ్యసనాలకు పాల్పడి ఇంట్లో ఉన్న భాగస్వామిని పట్టించుకోరు. దీంతో దంపతులిద్దరి మధ్య దూరం పెరిగి చివరికి వివాదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే భాగస్వామి కోసం కచ్చితంగా కొంత సమయం కేటాయించాలి. వారి కోసం కొన్ని రొమాంటిక్ గేమ్స్ ఆడుతూ ఉండాలి. అవేంటంటే?

కొందరు మానసిక నిపుణులు తెలుపున్న ప్రకారం.. భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే వారంలో కనీసం ఒక్కసారైనా లైంగిక ఆనందం ఉండాలి. అయితే కొందరికి ఎక్కువగ సార్లు కూడా పాల్గొనవచ్చు. అయితే అసలే ఈ పరిస్థితి కలగనప్పుడు వారితో కొన్ని రొమాంటిక్ పనులు చేయడం ద్వారా కూడా లైంగిక ఆనందం పొందే అవకాశం ఉంది. భార్య భర్తల మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే సరదాగా మాట్లాడుతూ.. జోకులు చెబుతూ ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. వీటిలో కొన్ని..

కొందరు లేడీస్ కు మంచి సంగీతం వినడం అంటే ఇష్టం. అయితే ఈ మ్యూజిక్ రొమాంటిక్ ది అయితే ఇంకా బాగుంటుంది. ఇద్దరు ఏకంతంగా ఉన్న సమయంలో మంచి రొమాన్స్ సంగీతం ఏర్పాటు చేసుకోండి. దీని ద్వారా ఇద్దరి మనసులు ప్రశాంతంగా మారి రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తుంది. ఆ తరువాత లైంగిక చర్యలో పాల్గొన్నా అధిక సంతోషంగా ఉంటారు.

ఆడవారికి ప్రాక్టికల్ చర్యలు ఎక్కువగా ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలో వారితో తీయటి మాటలు మాట్లాడాలి. సందర్భం వచ్చినప్పుడల్లా వారికి ఐలవ్యూ చెబుతూ ఉండండి. ఇలా చెప్పడం ద్వారా వారిలో ఉత్సాహం నెలకొంటుంది. భాగస్వామి తనను ఎంత ఇష్టపడుతున్నాడో ఈ మాటల ద్వారా తెలుస్తుంది. వారు మరింత దగ్గరవుతూ ఉంటారు.

చాలా మంది లైంగిక ఆనందం అనగానే పడక గది వరకే ఆలోచిస్తారు. కానీ ఇద్దరు కలిస షికార్లకు వెళ్లడం… షాపింగ్ చేయడం.. సినిమాలు చూడడం వంటికి కూడా భాగస్వామికి సంతోషాన్ని ఇస్తాయి. ఇలా చేయడం వల్ల జీవిత భాగస్వామిపై నమ్మకం పెరుగుతుంది. ఈ క్రమంలో ముద్దు ముద్దు గా ముచ్చట్లు చెప్పుకోవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.

కొంత మంది రాత్రి సమయంలోనే లైంగిక చర్యలో పాల్గొనాలని చూస్తారు. కానీ రాత్రి నిద్రించిన తరువాత మనసు యాక్టివ్ అవుతుంది. శరీరంలో కొత్త ఎనర్జీ వచ్చినట్లు అవుతుంది. ఈ సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల అధిక తృప్తి పొందుతారు. అంతేకాకుండా ఆ రోజంతా యాక్టివ్ ఉంటారు. రోజూ చేసే వ్యాయామానికి మించి ఇది ఎక్సర్ సైజ్ లా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version