Mana Shankara Varaprasad Garu: ఈమధ్య కాలం లో సినిమాలకు సోషల్ మీడియా లో వస్తున్నటువంటి టాక్ కలెక్షన్స్ పై చాలా గట్టి ప్రభావమే చూపిస్తోంది. యావరేజ్ రేంజ్ లో ఉన్న సినిమాలను కూడా కొంతమంది పనిగట్టుకొని తోక్కేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఇప్పుడు నీచమైన ఫ్యాన్ వార్స్ సంస్కృతీ నడుస్తోంది. టాప్ 6 స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే చాలు, వాళ్లకు వ్యతిరేకంగా ఉండే దురాభిమానులు హద్దులు దాటి మరీ నెగిటివ్ టాక్ ని వ్యాప్తి చేస్తున్నారు. సినిమా అంత చెత్తగా ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. నిన్న విడుదలైన ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రానికి ఏ రేంజ్ నెగిటివ్ టాక్ సోషల్ మీడియా లో వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా కచ్చితంగా గొప్ప రేంజ్ లో అయితే లేదు, ట్రైలర్ లో చూపించిన విజువల్స్ చాలా వరకు సినిమాలో కూడా లేవు, ఇది కచ్చితంగా నిరాశకు గురి చేసే విషయమే.
కానీ ఓవరాల్ గా సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ఎదో ఒకలా ఉంది, పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ మాత్రం సినిమాకు ఇంత రేంజ్ నెగిటివ్ టాక్ అవసరమా అనే ఫీలింగ్ కూడా వస్తాది. ఆ టాక్ ప్రభావం సినిమా పై చాలా గట్టిగానే పడింది. కానీ పబ్లిక్ లో ఆ రేంజ్ టాక్ లేకపోవడం తో నిన్న సెకండ్ షోస్ భారీ ఆక్యుపెన్సీలను నమోదు చేసుకున్నాయి. ఈ సినిమా సంగతి పక్కన పెడితే , మరో రెండు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి ఫిల్మోగ్రఫీ హిస్టరీ లో సోషల్ మీడియా లో ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ రావడం అనేది ఎప్పుడూ జరగలేదు.
క్రింజ్ కామెడీ, అసలు ఏమి కనెక్ట్ అవ్వలేదు అనే టాక్ మాత్రమే అనిల్ రావిపూడి సినిమా విడుదల రోజున సోషల్ మీడియా లో వినిపించే టాక్. ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్నాడు. సీనియర్ హీరో అయినప్పటికీ, చిరంజీవి కి కూడా నేటి తరం స్టార్ హీరోలకు ఉన్నంత నెగిటివిటీ ఉంది. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ చిరంజీవి సినిమాకు మొదటి ఆట నుండే నెగిటివ్ టాక్ చెప్పడం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అసలే అనిల్ రావిపూడి మూవీ కి సోషల్ మీడియా నుండి టాక్ రాదు, పైగా మెగాస్టార్ తో సినిమా, ఫలితం ఎలా ఉంటుందో ఏంటో అని అనిల్ రావిపూడి వణికిపోతున్నాడట. పైగా నిన్న రాజా సాబ్ పరిస్థితి సోషల్ మీడియా లో చూసిన తర్వాత ఆయనలో భయం ఇంకా రెట్టింపు అయ్యిందట.