Disaster Raja Saab trending: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడం ప్రభాస్ ఫ్యాన్స్ ని తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. మొదటి నుండి ఈ చిత్రం పై గొప్ప అంచనాలు ఉండేవి కాదు. కానీ రిలీజ్ ట్రైలర్ సినిమాపై బోలెడంత హైప్ ని తీసుకొచ్చింది. చిన్న సినిమా అనుకున్నాం, పర్లేదు డైరెక్టర్ మారుతి చాలా బాగా హ్యాండిల్ చేసినట్టు ఉన్నాడు, కచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిందే అనే ఫీలింగ్ ని తీసుకొచ్చింది ఆ ట్రైలర్. అప్పటి వరకు ఓవర్సీస్ లో అత్యంత దారుణమైన ఆక్యుపెన్సీలను అడ్వాన్స్ బుకింగ్స్ లో నమోదు చేసుకుంటూ వచ్చిన ఈ చిత్రం, ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా అడ్వాన్స్ బుకింగ్స్ పీక్ రేంజ్ కి వెళ్లడం మొదలు పెట్టింది.
కానీ సినిమా విడుదల తర్వాత ట్రైలర్ కి తగ్గట్టు సినిమా లేకపోవడం తో నెటిజెన్స్ ఆక్రోశం ఆకాశాన్ని అంటింది. ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ పిలిచి మరీ మారుతి లాంటి చిన్న డైరెక్టర్ కి అవకాశం ఇస్తే, దానిని ఉపయోగించుకోకుండా, ఇంత చెత్త సినిమా తీస్తాడా అని ప్రతీ ఒక్కరు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో #DisasterRajasaab అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అయ్యింది. నేషనల్ వైడ్ గా టాప్ 10 లో ట్రెండింగ్ అయిన ఈ ట్యాగ్ పై దాదాపుగా లక్ష ట్వీట్లు పడ్డాయి. అయితే ఇందులో అత్యధిక శాతం మంది సినిమాని చూడకుండా ప్రభాస్ మీద ద్వేషం తో ట్వీట్స్ వేసిన వాళ్ళే ఉన్నారు. సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ కల్చర్ ఎప్పటి నుండో ఉంది. అది ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. అందుకే ముందు వెనుక చూసుకోకుండా ఇష్టమొచ్చినట్టు ట్వీట్స్ వేశారు. ఇప్పటికీ ఈ ట్యాగ్ ట్రెండింగ్ లోనే ఉండడం విశేషం. ఇలా ప్రతీ స్టార్ హీరో సినిమాకు జరుగుతుంది, రాజా సాబ్ కి కూడా జరిగింది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది తెలియదు కానీ, ఈ ట్రెండింగ్ ఎఫెక్ట్ మాత్రం ఓపెనింగ్స్ పై బలంగా పడింది.