The Raja Saab Business: గత ఏడాది వరకు కూడా స్టార్ హీరో సినిమా అంటే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్. నాన్ థియేట్రికల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఇలా అన్ని రకాల బిజినెస్ లు విడుదలకు ముందే జరిగిపోయేవి. కానీ ఈ ఏడాది డైనమిక్స్ మొత్తం మారిపోయాయి. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా సరే, మార్కెట్ లో క్రేజ్, బజ్ ఉంటేనే కొంటాము, అడ్వాన్స్ లు ఇస్తామని అంటున్నారు బయ్యర్స్. జులై నెలలో విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆరేళ్ళ క్రితం మొదలైన సినిమా, మధ్యలో డైరెక్టర్ మారిపోయాడు, సినిమా నుండి విడుదల అవుతున్న ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫ్యాన్స్ ని , ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు, ఫలితంగా బయ్యర్స్ నిర్మాత కోరినంత డబ్బులు ఇవ్వడానికి అసలు ఇష్టం చూపలేదు.
స్వయంగా పవన్ కళ్యాణ్ కలగచేసుకుంటే కానీ ఆ సినిమా విడుదల అవ్వలేదు. అలాంటి పరిస్థితి మళ్లీ ఏ పెద్ద హీరో సినిమాకు కూడా రాదేమో అని అంతా అనుకున్నారు. కానీ చివరికి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ 2’ కి కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఇప్పుడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రానికి కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఈ చిత్రానికి మార్కెట్ లో క్రేజ్ లేదు. మేకర్స్ హైప్ రప్పించడం కోసం సినిమాలోని ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ని బయటకు వదులుతున్నారు. కానీ ఒక్కటి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా ఈ చిత్రానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఒక్క ప్రాంతం లో కూడా క్లోజ్ అవ్వలేదు. మరో 20 రోజుల్లో రాబోతున్న ప్రభాస్ సినిమాకు బిజినెస్ జరగలేదు అనే మాట వింటుంటే చాలా తేడా గా అనిపిస్తుంది కదూ.
కానీ వాస్తవాలు అలాగే ఉంటాయి మరి. ఓటీటీ బిజినెస్ కూడా అతి కష్టం మీద ముగిసింది. ఇప్పుడు రాజా సాబ్ నిర్మాత ముందు ఉన్న అతి పెద్ద సవాలు ఏమిటంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెచ్చుకోవడమే. ఈ సినిమాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు, IVY ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా నిర్మాతలుగా వ్యవహరించారు. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ తీసుకునే కొన్ని నిర్ణయాలు నచ్చక, IVY సంస్థ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఇప్పటి వరకు మేము పెట్టిన పెట్టుబడి 250 కోట్లు వడ్డీతో సహా చెల్లించాల్సిందే అని కోర్టు లో పిటీషన్ వేశారు. విశ్వప్రసాద్ ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయిలు తిరిగి ఇచ్చేసాడు కానీ. వడ్డీ మాత్రం బ్యాలన్స్ ఉండిపోయింది. మూడేళ్ళ నుండి సెట్స్ మీదున్న ప్రాజెక్ట్ ,వడ్డీ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. మరి విశ్వప్రసాద్ క్లియరెన్స్ తెచుకుంటాడా?, లేదా సినిమాని వాయిదా వేసుకుంటాడా అనేది చూడాలి.