Dhurandhar Telugu Version Release Date: ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని తలపించే వసూళ్లను రాబడుతూ, రోజుకి ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ, ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోయే రేంజ్ వసూళ్లను రాబడుతున్న చిత్రం ‘దురంధర్'(Dhurandhar Movie). భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. మౌత్ టాక్ జనాల్లో బాగా వ్యాప్తి చెందడంతో ఈ సినిమాకు వర్కింగ్ డేస్ లో కూడా కళ్ళు చెదిరే వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొదటి రోజు వచ్చిన వసూళ్లు, ఈరోజు కూడా వస్తున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ చిత్రం ఏ రేంజ్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అనేది. అయితే ఈ సినిమా కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.
చేయాల్సిన సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యరు, అనవసరమైన సినిమాలను మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తారు. మన తెలుగు ఆడియన్స్ మంచి సినిమాలను నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తారు అనే విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఏ భాషలో విడుదల చేసినా, చేయకపోయినా మన తెలుగు భాషలో మాత్రం విడుదల చేయాలి. విడుదల చేసిన మేకర్స్ అయ్యో అనవసరం గా డబ్బులు వృధా చేశామే నే ఫీలింగ్ ని కచ్చితంగా ఇవ్వరు మన ఆడియన్స్. ఉదాహరణకు ఈ ఏడాది లో విడుదలైన ‘చావా’ చిత్తాన్ని తీసుకోండి. హిందీ లో విడుదలైన మూడు వారాలకు ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేశారు. ఫలితంగా తెలుగు వెర్షన్ నుండి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ‘దురంధర్’ మేకర్స్ కూడా తెలుగు తో పాటు, ఇతర సౌత్ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ప్రస్తుతానికి డబ్బింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారట. క్రిస్మస్ కానుకగా కానీ, లేదా డిసెంబర్ 31న కానీ, ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అనుకున్న సమయంలో విడుదల చేయకపోతే, కచ్చితంగా ఓటీటీ లో అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెస్తారట. నేషనల్ అంశాల మీద తెరకెక్కించిన సినిమా, మొదట్లోనే అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసుంటే, మరో 200 కోట్ల రూపాయిల గ్రాస్ అదనంగా ఈ చిత్రానికి కలిసొచ్చేది కదా?, ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు మేకర్స్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.