Homeఎంటర్టైన్మెంట్Kangana Ranaut on Hijab Controversy: ప్చ్.. వివాదాల రాణి మళ్ళీ చెలరేగింది !

Kangana Ranaut on Hijab Controversy: ప్చ్.. వివాదాల రాణి మళ్ళీ చెలరేగింది !

Kangana Ranaut on Hijab Controversy: కర్ణాటక హిజాబ్ వివాదంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ధైర్యం చూపించాలంటే ఆఫ్ఘనిస్తాన్‌లో బురఖా వేసుకోకుండా చూపించండి. విముక్తి పొందడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు పంజరంలో బంధించుకోకండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు. మతపరమైన దుస్తుల కోడ్‌లను తొలగించేందుకు మద్దతిస్తున్న రచయిత ఆనంద్ రంగనాథన్ పోస్ట్‌ను కంగన షేర్ చేశారు.

Kangana Ranaut on Hijab Controversy
Kangana Ranaut on Hijab Controversy

మొత్తానికి కంగనా రనౌత్ కి ఆవేశం కాస్త ఎక్కువే. ముఖ్యంగా ఆమెకు వ్యవస్థలంటే అసలు భయం ఉండదు. పైగా ఎప్పుడు ఎవరిని తిడుతుందో ఆమెకే తెలియదు అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అందుకే, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్ మీడియా పోస్టులను సెన్సార్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చరణ్ జీత్ సింగ్ అనే వ్యక్తి పిటిషన్ కూడా వేసి కంగనా పోస్ట్ ల పై యుద్ధం కూడా చేశాడు. కానీ, ఆ పోస్ట్ లు ఆమె ఇష్టం అంటూ కంగనాకి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను కొట్టి పారేశారు.

Also Read: మళ్ళీ అడ్డంగా బుక్ అయిన మంచు విష్ణు !

అసలు కంగనా పై దాఖలైన ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శాంతిభద్రతల దృష్ట్యా భవిష్యత్తులో ఆమె చేసే ప్రతి పోస్టును పరిశీలించాలని అడ్వకేట్ చరణ్ జీత్ సింగ్ చందర్పాల్ చేసిన వినితిని తోసిపుచ్చింది. మొత్తానికి కోర్టు కూడా కంగనాకే సపోర్ట్ చేయడంతో ఇక ఆమెకు తిరుగులేకుండా పోయింది. అసలు ఈ వివాదాల హీరోయిన్ ‘కంగనా రనౌత్’ అంటేనే బాలీవుడ్ కి భయం. ఎప్పుడు ఎవరిని తిడుతుందో అని స్టార్ హీరోల సైతం కంగనా నోరు చూసి భయపడుతూ ఉంటారు.

తోటి నటీనటులు అందరూ కంగనా చేతిలో తిట్లు తిన్నవారే. అయితే, ఈ వివాదాల రాణి తెలుగు రచయత విజయేంద్ర ప్రసాద్ అంటే మాత్రం ఎనలేని గౌరవాన్ని అభిమానాన్ని చూపిస్తూ ఆయన చేత ప్రస్తుతం రెండు కథలు కూడా రాయించుకుంటుంది. పైగా విజయేంద్ర ప్రసాద్ కథ ఇస్తే కంగనా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ కథకు వెంటనే ఓకే చెప్పేస్తోందట.

Also Read: మ‌హేశ్ బాబు వ‌ద్ద‌న్న 13 సినిమాలు ఇవే.. అన్నీ సూపర్ హిట్‌..!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

3 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular