Shivaji: అర్హతలేని వాడికి ఆ స్థానం ఇచ్చారు… బిగ్ బాస్ రిజల్ట్ పై శివాజీ తీవ్ర ఆరోపణలు

గేమ్ ఓ దశకు వచ్చాక విన్నర్ ఎవరో .. ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా ఓ అంచనా వేశా. ఒక సమయంలో ప్రశాంత్ చేతిలో నేను రాసా .. 1,2,3 స్థానాల్లో మనం ముగ్గురమే ఉండబోతున్నాం అని చెప్పాను.

Written By: NARESH, Updated On : January 2, 2024 7:57 am

Shivaji

Follow us on

Shivaji: బిగ్ బాస్ సీజన్ 7 ముగిసినప్పటికీ దాని ఫీవర్ జనాల్లో ఏమాత్రం తగ్గడం లేదు. కామన్ మ్యాన్ టైటిల్ కొట్టడం ఏమోగానీ .. ఆ తర్వాత జరిగిన పరిణామాలు హాట్ టాపిక్ అయ్యాయి. టైటిల్ గెలిచిన సంతోషం కూడా లేకుండా పల్లవి ప్రశాంత్ పబ్లిక్ న్యూసెన్స్ కేసులో జైలుకు వెళ్లడం జరిగింది. తర్వాత బెయిల్ పై బయటకు రావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రశాంత్ బెయిల్ పై బయటకు రావడంతో అభిమానులు చల్ల బడ్డారు.

ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ కి గురువు గా మారిన శివాజీ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో తర్వాత శివాజీ వరుసగా టీవీ ఛానల్స్ , యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంగతులపై ఆయన అభిప్రాయం చెబుతున్నారు. ముఖ్యంగా శోభా శెట్టి గొడవతో తనని నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారు అని శివాజీ చెప్పారు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్ళింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలైతే .. అంటూ కోపంగా ప్రవర్తించాను అని శివాజీ చెప్పారు.

గేమ్ ఓ దశకు వచ్చాక విన్నర్ ఎవరో .. ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా ఓ అంచనా వేశా. ఒక సమయంలో ప్రశాంత్ చేతిలో నేను రాసా .. 1,2,3 స్థానాల్లో మనం ముగ్గురమే ఉండబోతున్నాం అని చెప్పాను. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని హైలైట్ చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం, మమ్మల్ని పక్కన పెట్టడంతో నాకు కాలింది. అతడి పేరు నేను చెప్పను కానీ, అతడిని కావాలనే హైలైట్ చేశారు.

పలుమార్లు ఫౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని రన్నరప్ చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి బ్యాడ్ నేమ్ రాకూడదు. అందుకే శోభా శెట్టి విషయంలో నాగార్జునతో నేను గట్టిగా మాట్లాడాను అని శివాజీ తెలిపారు. గేమ్ న్యాయంగా జరిగి ఉంటే టాప్ 3 లో ప్రశాంత్, నేను, యావర్ ఉండే వాళ్ళం. ఏది ఏమైనా రిజల్ట్ వచ్చేసింది కాబట్టి దాన్ని మనం గౌరవించాలి. నేను కామన్ మ్యాన్ కి సపోర్ట్ చేయాలని అనుకున్న అదే చేశా. అలాగని పూర్తిగా నేను సపోర్ట్ చేయలేదు. వాడి గేమ్ వాడు ఆడాడు గెలిచాడు అంటూ శివాజీ చెప్పుకొచ్చారు.