Bigg Boss Sivaji
Bigg Boss Sivaji: శివాజీ గురించి అతని నటన గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఇండస్ట్రీలో ఒక మార్క్ క్రియేట్ చేశారు శివాజీ. కానీ కొంతకాలంగా నటనకు దూరమయ్యారు. ఊహించని విధంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శివాజీ టీడీపీ పార్టీ కి మద్దతుగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఆ ఎన్నికల్లో తాను మద్దతు చేసిన పార్టీ ఘోర పరాజయం కావడంతో రాజకీయాల్లో మళ్ళీ కనిపించలేదు.
బిగ్ బాస్ షో తో మళ్ళీ వెలుగులోకి వచ్చాడు శివాజీ. ఆయన కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టినప్పుడు రెండు మూడు వారాల కంటే ఎక్కువ ఉండరని భావించారు. కానీ ఊహించని విధంగా టాప్ 3 లో నిలిచాడు. బిగ్ బాస్ షో తర్వాత శివాజీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతని రెండో భార్య గురించి చెప్పుకొచ్చాడు. శివాజీకి రెండో భార్య ఉందా ..? అని షాక్ అవ్వద్దు.
అతని రెండవ భార్య ఎవరో కాదు .. కాఫీ. అది లేక పోతే ఉండలేనని రెండో భార్య లాంటిది అని శివాజీ చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు శివాజీ కాఫీ కోసం చేసిన గొడవ అంతా ఇంతా కాదు. కాఫీ పంపిస్తావా .. చస్తావా.. లేదంటే బయటికి పోతా అంటూ శివాజీ మొండి పట్టు పట్టాడు. దెబ్బకు బిగ్ బాస్ కాఫీ పంపించాడు. హౌస్ లో ఉన్నపుడు కూడా శివాజీ కాఫీ తన రెండో పెళ్ళాం అంటూ చెప్పుకొచ్చాడు.
కాఫీ అంటే శివాజీకి అంత ప్రాణం అంట. కాగా శివాజీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. శివాజీ భార్య పేరు శ్వేత. బిగ్ బాస్ ద్వారా శివాజీ కుటుంభం జనాలకు పరిచయం అయ్యారు. శివాజీకి ఇద్దరు అబ్బాయిలు. బిగ్ బాస్ తో ఫుల్ క్రేజ్ సంపాదించిన శివాజీ వరుస ఇంటర్వ్యూ లతో బిజీ గా ఉంటున్నారు.