Savitri: సావిత్రికి ఉదయం భర్తగా, సాయంత్రం కొడుకుగా నటించిన ఏకైక నటుడు… ఎవరో తెలుసా?

మహానటి సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది నటులకు ఉండేది. ఆ అదృష్టం కొందరు స్టార్ హీరోలకు కూడా దక్కలేదు. అయితే ఓ నటుడు కెరీర్ ఆరంభంలోనే సావిత్రికి భర్తగా, కొడుకుగా ఏక కాలంలో రెండు విరుద్ధమైన పాత్రలు చేశాడు. ఆ నటుడు ఎవరో చూద్దాం..

Written By: S Reddy, Updated On : October 2, 2024 9:15 am

Savitri

Follow us on

Savitri: ఒకప్పుడు విచిత్రమైన కాంబినేషన్స్ చోటు చేసుకునేవి. ఏడాదికి ఓ హీరో పదికి పైగా చిత్రాల్లో నటించేవారు. తెలుగు సినిమాల్లో దాదాపు తెలుగు నటులు ఉండేవారు. ఒకే హీరోకి చెల్లిగా, ప్రేయసిగా నటించిన హీరోయిన్స్ ఉన్నారు. శ్రీదేవి బాల్యంలో ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించింది. స్టార్ హీరోయిన్ అయ్యాక.. ఆయనతో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో రొమాన్స్ చేసింది. అంజలి, ఎన్టీఆర్ హీరో హీరోయిన్ గా అనేక సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. అదే అంజలి ఫేడ్ అవుట్ అయ్యాక ఎన్టీఆర్ కి తల్లి పాత్రల్లో నటించి మెప్పించింది.

కాగా ఓ నటుడు మహానటి సావిత్రికి ఏక కాలంలో భర్తగా కొడుకుగా నటించడం విశేషం. ఇవి రెండు విరుద్ధమైన పాత్రలు అని చెప్పొచ్చు. ఆ నటుడు ఎవరంటే.. గిరిబాబు. 1973లో జగమే మాయ చిత్రంతో గిరిబాబు పరిశ్రమలో అడుగుపెట్టాడు. అదే ఏడాది గిరిబాబు జ్యోతి-లక్ష్మి, అనగనగా ఓ తండ్రి చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో సావిత్రి సైతం నటించారు.

జ్యోతి-లక్ష్మి చిత్రంలో గిరిబాబు సావిత్రికి భర్త పాత్ర చేశాడట. మరోవైపు అనగనగా ఓ తండ్రి చిత్రంలో సావిత్రికి కొడుకుగా చేశాడట. మరో విశేషం ఏమిటంటే.. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఒకే సమయంలో జరిగిందట. ఉదయం జ్యోతి-లక్ష్మి చిత్రం కోసం భార్యాభర్తలుగా నటించిన సావిత్రి-గిరిబాబు.. సాయంత్రం అనగనగా ఓ తండ్రి మూవీ షూటింగ్ లో తల్లీ కొడుకులుగా నటించేవారట. అప్పట్లో ఈ న్యూస్ ప్రాధాన్యత సంతరించుకుంది.

కెరీర్ బిగినింగ్ లోనే గిరిబాబు మహానటి సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం పొందాడు. అనంతరం గిరిబాబు పరిశ్రములో విలన్ గా సెటిల్ అయ్యాడు. వందల చిత్రాల్లో కరుడుగట్టిన విలన్ రోల్స్ చేశాడు. 90లలో గిరిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సక్సెస్ అయ్యాడు. హీరో, హీరోయిన్ తండ్రి పాత్రలు చేశాడు. గిరిబాబు మంచి కామెడీ కూడా పంచగలడు.

గిరిబాబు ప్రస్థానం సుదీర్ఘ కాలం సాగింది. గిరిబాబు కుమారుల్లో ఒకరైన రఘుబాబు సైతం సక్సెస్ఫుల్ యాక్టర్. ఆయన మొదట్లో విలన్ రోల్స్ చేశాడు. ఆది, దిల్ వంటి చిత్రాలు రఘుబాబుకు పాపులారిటీ తెచ్చాయి. అనంతరం కమెడియన్ గా టర్న్ అయ్యాడు. అనేక చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసి మెప్పించాడు. ఈ మధ్య రఘుబాబు సినిమాలు తగ్గించారు. గతంలో మాదిరి ఎక్కువ చిత్రాల్లో కనిపించడం లేదు. ఇక గిరిబాబు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. వయసు రీత్యా చిత్రాలు చేయడం లేదు.