https://oktelugu.com/

Bigg Boss Telugu 8: మణికంఠ ని చిత్తుగా ఓడించిన యష్మీ..తోటి క్లాన్ సభ్యుల సహాయం నిరాకరించిన మణికంఠ!

బాల్స్ బ్యాలన్స్ టాస్కు లో అద్భుతంగా గేమ్ ని ఆడి తన సత్తా చాటింది యష్మీ. మణికంఠ ఎప్పటిలాగానే హంగామా చేసి ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత దానికి కారణం క్లాన్ లో ఉన్న సభ్యులే అని పెద్ద గోల చేస్తాడని అందరూ ఊహించారు. కానీ అలా చేయకుండా ఆడియన్స్ ని బ్రతికించాడు, అయినప్పటికీ కూడా ఆ ఘటనపై చర్చలు జరిపాడు. ఈ టాస్కు ఏమిటంటే వివిధ సైజులతో కొన్ని బాల్స్ ఉంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 2, 2024 / 08:59 AM IST

    Bigg Boss Telugu 8(63)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో గత రెండు వారల నుండి యష్మీ కి మణికంఠ అంటే పీకల దాకా కోపం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎందుకంటే స్నేహం పేరుతో ఆమెకి నామినేషన్స్ లో వెన్నుపోటు పొడిచాడని. ప్రతీ వారం నిన్ను హౌస్ నుండి బయటకి పంపేందుకు నేను నామినేట్ చేస్తూనే ఉంటాను అని సవాలు విసిరింది యష్మీ. ఆ సవాలు కి తగ్గట్టుగానే ఆమె ప్రతీ వారం మణికంఠని నామినేట్ చేస్తూ వచ్చింది. ఈ వారం కూడా నామినేట్ చేసింది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో యష్మీ మణికంఠ పై ఒక టాస్కు గెలిచి పై చెయ్యి సాధించింది. బాల్స్ బ్యాలన్స్ టాస్కు లో అద్భుతంగా గేమ్ ని ఆడి తన సత్తా చాటింది యష్మీ. మణికంఠ ఎప్పటిలాగానే హంగామా చేసి ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత దానికి కారణం క్లాన్ లో ఉన్న సభ్యులే అని పెద్ద గోల చేస్తాడని అందరూ ఊహించారు. కానీ అలా చేయకుండా ఆడియన్స్ ని బ్రతికించాడు, అయినప్పటికీ కూడా ఆ ఘటనపై చర్చలు జరిపాడు. ఈ టాస్కు ఏమిటంటే వివిధ సైజులతో కొన్ని బాల్స్ ఉంటాయి.

    వాటిని ఒక సన్నటి కర్ర మీద నడుస్తూ చివరి వరకు వెళ్లి బోట్ ఆకారం లో ఉన్న దాంట్లో బాల్స్ పెట్టాలి. మళ్ళీ దిగేటప్పుడు బ్యాలన్స్ చేసుకుంటూ ఆ బాల్స్ క్రిందపడకుండా చూసుకోవాలి. ఈ టాస్కులో యష్మీ పృథ్వీ రాజ్ గైడన్స్ తీసుకొని చాలా చక్కగా గేమ్ ఆడి గెలుస్తుంది. కానీ మణికంఠ కి అతని క్లాన్ సభ్యులు పదే పదే సూచనలు ఇస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. పైగా మీరు అరవకండి, మీరు అరిస్తే నేను కన్ఫ్యూజ్ అయ్యి బాల్స్ ని క్రిందకి పడేస్తాననే భయం వచ్చేస్తుంది అని అంటాడు. అలా మూడు సార్లు తన క్లాన్ సభ్యులపై అరుస్తాడు. దీంతో ఆయనకు సలహాలు ఇవ్వడం మానేశారు. ఇప్పుడు ఇతనికి సలహాలు ఇచ్చినందుకు కూడా వచ్చే వారం నామినేట్ చేస్తాడేమో అని భయపడుతున్నారు సొంత క్లాన్ సభ్యులు. మరోపక్క యష్మీ మణికంఠ పై ఇప్పటికీ పీకల దాకా కోపం లో ఉంది.

    బాత్ రూమ్ లో ఈ వారం జరగబోయే డబుల్ ఎలిమినేషన్ గురించి యష్మీ, ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేరణ యష్మీ తో మాట్లాడుతూ ‘ఈ వారం ఆదిత్య ఓం, మణికంఠ ఎలిమినేట్ అయిపోతారని అనిపిస్తుంది’ అంటుంది. అప్పుడు యష్మీ మాట్లాడుతూ ‘అబ్బా..నాకు ఆ మణికంఠ ఎలిమినేట్ అవ్వాలి..ఇతని లాంటి ఫేక్ పర్సన్ ని నేను ఎప్పుడూ చూడలేదు’ అని అంటుంది. అప్పుడు ప్రేరణ ‘హౌస్ లోకి వచ్చిన కొద్దిరోజులకే అతనికి అంతలా కనెక్ట్ అయ్యి స్నేహం చేసావా?, అతను వెన్నుపోటు పొడిచిందని ఇంత ఫీల్ అవుతున్నావు?’ అని అడగగా, దానికి యష్మీ సమాధానం చెప్తూ ‘అతని బ్యాక్ గ్రౌండ్ చూసి బాగా ఫీల్ అయ్యి కనెక్ట్ అయ్యాను, కానీ ఇలా ఎమోషన్స్ తో ఆదుకునే ఫేక్ మనిషి అని నాకేం తెలుసు’ అని అంటుంది.