Heroes
Heroes : గత రెండు మూడు రోజుల నుండి సినీ పరిశ్రమలోని ప్రముఖులపై ఐటీ రైడింగ్స్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం నిర్మాతలు, దర్శకులపైన మాత్రమే ఫోకస్ చేశారు. కొంతమంది నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్షియర్స్ ఇళ్లపై కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. మొత్తం మీద 55 మంది అధికారులు బృందాలుగా విడిపోయి, ఒకేసారి ఐటీ అన్ని చోట్ల ఐటీ సోదాలు నిర్వహించారు. కేవలం ఒక్క దిల్ రాజు ఇంట్లోనే మూడు రోజుల నుండి తిష్ట వేసుకొని కూర్చున్నారంటే, ఎంత సీరియస్ గా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే రాబోయే మూడు రోజులు ఐటీ అధికారులు మన టాలీవుడ్ స్టార్ హీరోలపై ఐటీ సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. వారిలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మంచి క్రేజ్, పాపులారిటీ ని ఎంజాయ్ చేస్తూ రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న నలుగురు హీరోలలో ముగ్గురు వీళ్ళే. రామ్ చరణ్ కూడా వీళ్ళ స్థాయిలోనే రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. కానీ ఆయన లిస్ట్ లో ఎందుకు లేడో ప్రస్తుతానికి సమాచారం లేదు. అయితే ఈ ముగ్గురి సినిమాలు ఇటీవల కాలంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రభాస్ లాభాల్లో వాటాలు తీసుకోడు కానీ, ఒక్కో సినిమాకి ఆయన 120 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. అంతే కాకుండా భవిష్యత్తులో ఆయన చేయబోయే సినిమాలకు కూడా వందల కోట్లలో అడ్వాన్స్ ని అందుకున్నాడట. హోమబుల్ సంస్థ లో మూడు సినిమాలు చేసేందుకు గాను 350 కోట్ల రూపాయిల డీల్ ప్రభాస్ తో జరిగింది. వీటికి సంబంధించిన సమాచారం మొత్తం ఐటీ అధికారుల వద్ద ఉండడంతో ఈయన ఇంటిపై కూడా సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
అదే విధంగా అల్లు అర్జున్ ఇంటిపై కూడా ఐటీ సోదాలు జరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రీసెంట్ గానే పుష్ప నిర్మాతల ఇళ్లపై, అదే విధంగా డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో 531 కోట్ల రూపాయిలకు పైగా తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అల్లు అర్జున్ కూడా రెమ్యూనరేషన్ కి బదులుగా, లాభాల్లో వాటాలను అందుకున్నాడు కాబట్టి, ఆయనపై కూడా సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక చివరిగా ఎన్టీఆర్ పై కూడా సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయట. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించాడు. ఈ చిత్రానికి కూడా ఎన్టీఆర్ లాభాల్లో వాటాలు పంచుకున్నాడు. అందుకే ఐటీ అధికారులు వీళ్ళ ఇంటిపై కూడా సోదాలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మరి ఇవి ఎంత నిజమో మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది.