Uttar Pradesh : మౌళిక సౌకర్యాలు.. ఏ రాష్ట్ర ప్రగతిని చూడాలన్నా ముందు కావాల్సింది కనీస మౌళిక సౌకర్యాలు. అందులో కూడా ప్రధానమైనది తాగునీరు.. రోడ్లు.. విమానాశ్రయాలు కూడా ప్రధానమైనది. ఏ పెట్టుబడిదారుడిని ఆకర్షించాలన్నా ఇవి కనీసంగా ఉండాలి. ఈ అంశంలో సదరన్, వెస్ట్రన్ స్టేట్స్ ముందంజలో ఉన్నాయి. నార్త్, ఈస్ట్ వెనుకబడి ఉన్నాయి..
ముఖ్యంగా నార్త్ లో ఉత్తరప్రదేశ్, బీహార్ దారుణాతి దారుణంగా వెనుకబడి ఉన్నాయి. యోగి 2016లో అధికారంలోకి వచ్చాక ఉత్తరప్రదేశ్ లో పరిస్థితులు మారిపోయాయి. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మోస్ట్ హ్యాపినింగ్ స్టేట్ గా మారిపోయింది.
జలజీవన్ మిషన్ కింద యూపీలో 85 శాతం మందికి తాగునీరు వచ్చింది. కులాయి ద్వారా సరఫరా జరుగుతోంది. ఇక ఒకప్పుడు 3 నుంచి 5 శాతం ఉన్న ఈ తాగునీటి సదుపాయం ఇప్పుడు ఎంతో పెరిగింది. తర్వాత రెండోది రోడ్లు, విమానాశ్రయాలు చూస్తుంటే..
ఎక్స్ ప్రెస్ వేలు 6 యూపీలో ఉన్నాయి. కొత్తగా 2025లో ఇంకో 5 ఓపెన్ కాబోతున్నాయి. నిర్మాణంలో ఇంకో 8 నుంచి 9 ఉన్నాయి. దాదాపు 20 ఎక్స్ ప్రెస్ వేలు ఒక రాష్ట్రంలో ఉండడం అద్భుతం అని చెప్పొచ్చు. అమెరికాలో కూడా ఒక రాష్ట్రంలో 20 లేవు.
ఎయిర్ పోర్ట్ లు ఇప్పటికే 15 ఉన్నాయి. నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు 11 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇంకా రాబోతున్నాయి. మొత్తం 21 ఎయిర్ పోర్టులు ఉత్తరప్రదేశ్ లో రాబోతున్నాయి.
ఉత్తర ప్రదేశ్ దశ దిశ మార్చబోతున్న మౌలిక సౌకర్యాల వివరాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.