https://oktelugu.com/

Raj Kundra: రాత్రి 9 తర్వాత మరదలితో పార్టీలు… స్టార్ హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్

రాజ్ కుంద్రా మాట్లాడుతూ మా పెళ్ళైన కొత్తలో శిల్పా చాలా పద్ధతిగా ఉండేది. పార్టీ, పబ్ లు తనకు పెద్దగా నచ్చేవి కాదు. అందుకే రాత్రి 9 గంటలకు నిద్ర పోతుంది.

Written By:
  • Shiva
  • , Updated On : July 29, 2023 / 09:55 AM IST

    Raj Kundra

    Follow us on

    Raj Kundra: బోల్డ్ కామెంట్స్ చేయాలంటే బాలీవుడ్ నటులు తర్వాతే. తమ పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి సిగ్గు మొహమాటం లేకుండా మీడియా ముందు రియాలిటీ షో ల్లో ఓపెన్ గా మాట్లాడుతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యే పోర్నోగ్రఫీ కేసులో ఇరుక్కున్న రాజ్ కుంద్రా పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు.

    ఎప్పుడైనా బయటకు వచ్చిన కానీ మీడియా కంట పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. వారికి సంబంధించిన ఓల్డ్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా శిల్పా శెట్టి ని పెళ్లి చేసుకోవడం వలన వాళ్ళ చెల్లెలు తో కలిసి పార్టీలకు తిరుగుతున్నా అంటూ గతంలో ఒక షో లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి.

    ఈ వీడియో రాజ్ కుంద్రా మాట్లాడుతూ మా పెళ్ళైన కొత్తలో శిల్పా చాలా పద్ధతిగా ఉండేది. పార్టీ, పబ్ లు తనకు పెద్దగా నచ్చేవి కాదు. అందుకే రాత్రి 9 గంటలకు నిద్ర పోతుంది. ఇక నేను పార్టీ కి వెళ్లాలంటే శిల్పా వాళ్ళ చెల్లెలు షమితా శెట్టి ని పిలిచేవాడిని నో అని చెప్పకుండా తను నాతో పార్టీలకు వచ్చేదంటూ చెప్పుకొచ్చాడు.

    అలా అలవాటు అయిపోయి ఎప్పుడైనా పార్టీలకు వెళ్లాలంటే ముందుగా షమితా పేరే నా మైండ్ లోకి వచ్చేది. అదే ఇంట్లో ఫ్యామిలీ తో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలంటే శిల్పా గుర్తుకు వచ్చేది. అందుకే షమితా కి త్వరగా పెళ్లి కావాలని నేను కోరుకోవడం లేదని అదే షో లో చెప్పాడు రాజ్ కుంద్రా. 2009 ఫిబ్రవరి లో ఎంగేజిమెంట్ చేసుకున్న ఈ జంట నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు. గతంలో పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇన్వాల్ అయిన సమయంలో శిల్పా శెట్టి అతనితో విడాకులు తీసుకోబోతుందనే మాటలు వినిపించిన కానీ అవేమి నిజం కావని తేలిపోయాయి.

    ఇక సినిమాల విషయానికి వస్తే బాజీ ఘర్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన శిల్పా “సాహస వీరుడు సాగర కన్య ” సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యి, వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసు సినిమాల్లో నటించిన శిల్పా బాలీవుడ్ లో స్థిరపడి పోయింది.