https://oktelugu.com/

Hollywood Horror Movie: ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ ని ఒంటరిగా చూస్తే బ్లాంక్ చెక్ ఇస్తానన్న మేకర్స్…

Hollywood Horror Movies: 'ఆర్కశ స్టీవెన్ సన్ ' అనే లేడీ డైరెక్టర్ రీసెంట్ గా ఒక హార్రర్ సినిమా తీసింది. ఈ సినిమాను ఎవరు చూసిన కూడా భయం తో వణుకిపోవాల్సిందే...ఇక ఈ సినిమా ఈ ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో భయనక సంఘటనలు పుష్కలంగా ఉంటాయి.

Written By:
  • Gopi
  • , Updated On : July 12, 2024 / 10:22 AM IST

    Hollywood horror movie The First Omen

    Follow us on

    Hollywood Horror Movie: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చే సినిమాలు అందరిని ఆకర్షించడం లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇక ప్రపంచం లో ఎక్కడ చూసిన కూడా హాలీవుడ్ సినిమాలను మించిన సినిమా ఇండస్ట్రీలో మరొకటి లేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ లో 100% వర్క్ ఎఫర్ట్ ని చూపిస్తూ సినిమా అవుట్ ఫుట్ ని ఎక్స్ ట్రా ఆర్డినరీగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక అందుకే హాలీవుడ్ నుంచి ఒక జురాసిక్ పార్క్, ఒక మెకానస్ గోల్డ్, ఒక అవతార్, ఒక టైటానిక్ లాంటి భారీ రేంజ్ సినిమాలనేవి వచ్చాయి.

    ఇక వాళ్లు చూపించే విజువల్ వండర్ కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫిదా అవ్వక తప్పదు…ఇక ఇది ఇలా ఉంటే హాలీవుడ్ లో మేల్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా ఫిమేల్ డైరెక్టర్స్ కూడా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకుంటుంటారు. వాళ్ళు కూడా ఆస్కార్ అవార్డులను గెలుచుకొని టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతుండటం విశేషము…ఇక ఇదిలా ఉంటే ‘ఆర్కశ స్టీవెన్ సన్ ‘ అనే లేడీ డైరెక్టర్ రీసెంట్ గా ఒక హార్రర్ సినిమా తీసింది. ఈ సినిమాను ఎవరు చూసిన కూడా భయం తో వణుకిపోవాల్సిందే…ఇక ఈ సినిమా ఈ ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో భయనక సంఘటనలు పుష్కలంగా ఉంటాయి.

    ఇక హార్రర్ సినిమాలు చూడాలనుకునేవారు తప్పకుండా ఈ సినిమాను మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇక లేడీ డైరెక్టర్ తన విజువల్ తో ఎలాంటి సక్సెస్ ను సాధించింది అనేది ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దర్శకురాలు యొక్క సృజనాత్మకత ఏ లెవెల్లో ఉందో కూడా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ప్రతి సీన్ లో కూడా ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేయడంలో దర్శకురాలు చాలా వరకు సక్సెస్ అయింది… సినిమా రిలీజ్ అయిన సమయంలో ఈ సినిమాని ఎవరైనా ఒంటరిగా థియేటర్లో చూసినట్లైతే వాళ్లు కోరినంత డబ్బును ఇస్తామని బ్లాంక్ చెక్ ను కూడా రెఢీ చేసి పెట్టారు. కానీ ఆ సాహసాన్ని ఎవరు చేయలేదు. ఎందుకంటే ఈ సినిమాని జనాలందరి మధ్యలో కూర్చొని చూసినా కూడా భయపడకుండా ఉండలేం…

    అలాంటిది ఒంటరిగా చూడాలంటే మాత్రం ఎవరి ధైర్యం సరిపోదనే చెప్పాలి. అలాంటి ఒక మాస్టర్ పీస్ ని జనాల ముందుకు వదిలారు. నిజానికి ఇండియాలో ఈ సినిమాకి ఎక్కువగా ఆదరణ లభించలేదు. కానీ వేరే దేశాల్లో మాత్రం ఈ సినిమాని చాలా మంది చూసి సూపర్ సక్సెస్ గా నిలిపారు. నిజానికి హాలీవుడ్ మేకర్స్ అందరూ కూడా తమ స్టాండర్డ్ లో అద్భుతమైన ఔట్ పుట్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక అందులో స్టీవెన్ సన్ కూడా చాలావరకు అదే ప్రయత్నం చేశారు…

    ఇంకా ఇప్పటి వరకు కూడా ఈ సినిమాని ఎవరైనా చూడకపోయి ఉంటే నెట్ ఫ్లిక్స్ లో ఉంది తప్పకుండా వెళ్లి చూడండి. ఇక మన ఇండియన్స్ ఎక్కువగా హర్రర్ సినిమాలను ఇష్టపడుతుంటారు. కానీ మన వాళ్లు ఇక్కడ హార్రర్ సినిమాలు ఎక్కువగా చేయలేరు. ఒకవేళ చేసిన అది కూడా చిన్న చిన్న దర్శకులు చేస్తుంటారు. కాబట్టి క్వాలిటీ పరంగా అయిన, విజువల్ పరంగా అయిన అవి అంత ఎఫెక్ట్ గా అనిపించవు. కాబట్టి హాలీవుడ్ సినిమాల వైపు మన ప్రేక్షకులు మొగ్గు చూపిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ సినిమా ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి…