https://oktelugu.com/

Kamal Haasan: అల్లరి చిల్లరగా తిరిగే కమలహాసన్ లోక నాయకుడి గా ఎలా ఎదిగాడు…

1954 నవంబర్ 7వ తేదీన 'పరంకుడి ' అనే ప్రాంతం లో 'శ్రీనివాస్ రాజ్యలక్ష్మి ' అనే దంపతులకు నాల్గోవ సంతానం గా కమలహాసన్ జన్మించాడు. ఇక మొదట్లో ఈయన పేరు పార్థసారథిగా ఉండేది. కానీ వాళ్ళ నాన్న పార్థసారథి అనే పేరు అతనికి పర్ఫెక్ట్ గా లేదని కమల్ హాసన్ అనే పేరుని పెట్టాడు... ఇక చిన్నప్పుడు కమల్ హాసన్ చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడు. తన అల్లరిని తట్టుకోవడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు. ఇక కమల్ హాసన్ ఒకరోజు అనుకోకుండా వాళ్ళ నాన్నతో కలిసి సినిమా షూటింగ్ చూడ్డానికి స్టూడియో కి వెళ్ళాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 12, 2024 / 10:13 AM IST

    Kamal Haasan

    Follow us on

    Kamal Haasan: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు కమలహాసన్…ఎలాంటి పాత్రలో అయిన సరే అలవోకగా నటించి మెప్పించగలిగే నైపుణ్యం కలిగిన అతి తక్కువ మంది నటులలో కమలహాసన్ ఒకరు. ప్రస్తుతం కమలహాసన్ భారతీయుడు 2 సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి ఈరోజు మన ముందుకు వచ్చాడు. ఇక కమలహాసన్ తన కెరీయర్ని ఎలా బిల్డ్ చేసుకున్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    1954 నవంబర్ 7వ తేదీన ‘పరంకుడి ‘ అనే ప్రాంతం లో ‘శ్రీనివాస్ రాజ్యలక్ష్మి ‘ అనే దంపతులకు నాల్గోవ సంతానం గా కమలహాసన్ జన్మించాడు. ఇక మొదట్లో ఈయన పేరు పార్థసారథిగా ఉండేది. కానీ వాళ్ళ నాన్న పార్థసారథి అనే పేరు అతనికి పర్ఫెక్ట్ గా లేదని కమల్ హాసన్ అనే పేరుని పెట్టాడు… ఇక చిన్నప్పుడు కమల్ హాసన్ చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడు. తన అల్లరిని తట్టుకోవడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు. ఇక కమల్ హాసన్ ఒకరోజు అనుకోకుండా వాళ్ళ నాన్నతో కలిసి సినిమా షూటింగ్ చూడ్డానికి స్టూడియో కి వెళ్ళాడు.

    అక్కడ సావిత్రి, జెమినీ గణేషన్ లను పెట్టి ఏబీఎన్ ప్రొడక్షన్ వాళ్లు ‘కల్లాతు కల్లమ్మ’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే అక్కడ కూడా కమలహాసన్ తన అల్లరి చిల్లరి పనులు చేయడంతో దర్శక నిర్మాతలు కమలహాసన్ ను చూసి ఈ సినిమాలో ఒక చిన్న పిల్లాడి పాత్ర ఉంది. దానికి మీ అబ్బాయిని తీసుకుంటున్నామని వాళ్ళ నాన్నతో చెప్పారట. వాళ్ళ నాన్న కూడా అబ్జెక్షన్ ఏమి చెప్పకుండా వాడు చేస్తాను అంటే చేయించుకోండి నాకేం అభ్యంతరం లేదని చెప్పాడు. ఇక అప్పుడు దర్శకనిర్మాతలు కమలహాసన్ ను మా సినిమాలో యాక్టింగ్ చేయమని అడగగా, చేస్తాను కానీ డబ్బులు ఎంత ఇస్తారు అని ఏ మాత్రం భయం లేకుండా అడిగాడట. ఇక కమలహాసన్ వైఖరి చూసిన వాళ్లకి ఒకసారిగా నవ్వొచ్చిందట. ఇలాంటి కుర్రాడు మన పాత్రకి కావాలని అతన్ని పెట్టి ఆ సినిమాను తీశారు. ఇక మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న కమలహాసన్ ఆ పాత్రలో తను నటించిన నటనకి ‘నేషనల్ అవార్డు’ ను కూడా అందుకున్నాడు…

    ఇక ఆ పాత్ర కోసం 2500 రూపాయలు కూడా ప్రొడ్యూసర్ చెల్లించినట్టుగా కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.. ఇక అక్కడి నుంచి మొదలైన ఆయన సినిమా ప్రస్థానం కొద్దిరోజుల పాటు బాగా సాగింది. ఇక దాంతో వాళ్ల నాన్న కమలహాసన్ ను చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పి ఒక ప్రైవేటు స్కూల్ లో జైన్ చేశారట. కానీ ఆయన అల్లరికి ఆ స్కూల్ యాజమాన్యం తట్టుకోలేక వాళ్ల నాన్న ను పిలిచి మీ వాడికి మేము చదువు చెప్పలేము అని టిసి ఇచ్చి పంపించారట. ఇక అప్పుడు వాళ్ల నాన్న నీకు ఏం ఇష్టం ఉందో చెప్పమని అడిగితే నేను భరతనాట్యం నేర్చుకుంటనని చెప్పాడట. దాంతో వాళ్ల నాన్న భరతనాట్యం నేర్పించాడు అలాగే కథాకళి కూడా నేర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత బాలచందర్ దగ్గర శిష్యరికం చేసిన కమలహాసన్ డైరెక్టర్ అవుదామనుకున్నప్పటికీ బాలచందర్ మాత్రం తనలో ఉన్న నటుడిని చూసి అతన్ని నటన వైపు మళ్ళింపజేసి అతనితో కొన్ని సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందించాడు. ముఖ్యంగా ‘మరో చరిత్ర’ సినిమాతో ఆయన కమలహాసన్ ని స్టార్ హీరోని చేసేసాడు…

    ఇక ఈ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో కూడా కమలహాసన్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటినుంచి వెను తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇక అప్పుడే కే విశ్వనాథ్ కమలహాసన్ ను ఊహించుకొని ‘సాగర సంగమం’ అనే కథ రాసుకున్నాడు. కానీ కమలహాసన్ చేస్తాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోకుండానే తను కథ రెడీ చేసుకోవడంతో కె విశ్వనాథ్ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరావు ఇద్దరు కలిసి కమలహాసన్ దగ్గరికి వెళ్లి ఈ కథని చెప్పారట. కమలహాసన్ అప్పుడు ఈ సినిమా చేయనని చెప్పాడట. దానికి కారణం ఏంటి అంటే ఇందులో తాగుబోతు క్యారెక్టర్ లో నటించాలి. ఇంకొకటి ముసలి పాత్రలో నటించాలి. కాబట్టి ఆ రెండు తను చేయలేనని దాని వల్ల తన కెరియర్స్ పాడై పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పాడట. అయినప్పటికీ ఆ పాత్రలో కే విశ్వనాథ్ మరొకరిని ఊహించుకోలేనని చెప్పడంతో ఏడిద నాగేశ్వరరావు ఒక 5, 6 నెలల పాటు కమలహాసన్ చుట్టు తిరిగి మొత్తానికైతే ఆయన డేట్స్ సంపాదించాడు. అలా సాగర సంగమం సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఇక దాంతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కమలహాసన్ ఇలాంటి సినిమాల్లో నటించి కూడా సూపర్ సక్సెస్ అందుకోవచ్చా అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆశ్చర్యపోయేలా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు…

    ఇక చిన్నతనంలోనే భరతనాట్యం,కథాకళి లాంటి వాటిలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్న ఆయనకి ఈ సినిమాలో అవన్నీ యూజ్ అవుతూ వచ్చాయి… ఇక అప్పటి నుంచి తను తమిళంలో ఏ సినిమా చేసిన తెలుగులో డబ్ చేస్తూ రిలీజ్ చేస్తూ వచ్చాడు. తెలుగులో కూడా ఆయన ఒక స్టార్ హీరోగా ఎదగడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అటు తమిళ్ సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా సినిమాలు చేసేవాడు. ఇక శంకర్ డైరెక్షన్ లో చేసిన ‘భారతీయుడు’ సినిమా అయితే కమలహాసన్ ను తెలుగులో కూడా స్టార్ హీరోల పక్కన నిలబెట్టింది. ఇక ఈ సినిమాతో కమలహాసన్ తెలుగులో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కమర్షియల్ సినిమాలతో కూడా ఆయన సక్సెస్ సాధించగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు.

    ఇక అప్పటివరకు ఆయన అన్ని ఆర్ట్ సినిమాలు మాత్రమే చేయగలడని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాతో తనను తాను మరొకసారి పరిపూర్ణంగా మార్చేసుకుని ఎలాంటి పాత్రనైనా సరే చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అప్పట్నుంచి ఆయన కెరియర్ లో వరుస సినిమాలు అయితే వచ్చాయి.భామని సత్యభామని, శుభ సంకల్పం, నాయకుడు, పంచతంత్రం, పోతురాజు,దశావతారం, విశ్వరూపం లాంటి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఫలితంగా లోకనాయకుడు అనే బిరుదును కూడా సంపాదించుకున్నాడు.