OG Washi O Washi Song: ‘ఓజీ'(They Call Him OG) చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే గ్లింప్స్ వీడియో ఎంత పెద్ద సెన్సేషన్ ని సృష్టించిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట ఈ చిత్రం పై ఉన్న అంచనాలను పదింతలు ఎక్కువ చేసింది. అదే విధంగా ‘సువ్వి సువ్వి’ పాట మెలోడీ సాంగ్ లవర్స్ ని ఆకట్టుకుంది కానీ, ఫైర్ స్ట్రోమ్ రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పుట్టిన రోజు నాడు విడుదలైన ‘ది ట్రాన్స్ ఆఫ్ ఒమీ’ గ్లింప్స్ వీడియో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ రేంజ్ కంటెంట్ ఉంటే ఈ సినిమా ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంటుందని, వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ఫ్యాన్స్.
ఇకపోతే నేడు ఈ సినిమా నుండి ‘గన్స్ & రోజెస్’ పాట విడుదల కాబోతుంది. దీనికి ముందు నిన్న రాత్రి ఓజీ మేకర్స్ ‘#WashiOWashi’ అంటూ ఒక వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది . ఫ్యాన్స్ కి అర్థం తెలియదు కానీ, వాళ్లకు తోచిన విధంగా రీసెర్చ్ చేశారు. నిన్ననే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను కొన్ని సోషల్ మీడియా లో విడుదల చేశారు. ఆ డబ్బింగ్ పేపర్ మీద పైన ‘వాషి ఓ వాషి’ అని ఉంది. చివర్లో అదే వాక్యంతో ముగుస్తుంది. చూస్తుంటే ఈ ఇది పవన్ కళ్యాణ్ పాడిన జపనీజ్ పాట అని, అందుకే మేకర్స్ దీనిని ఇంత హైలైట్ చేస్తున్నారని అంటున్నారు ఫ్యాన్స్. అయితే ‘Washi’ అంటే జపనీజ్ భాషలో ఈగల్ అని అర్థం. అక్కడి సమురాయ్ క్లాన్స్ లో ఇది కూడా ఒక క్లాన్ అని చెప్పొచ్చు.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. సినిమా విడుదలకు ఇంకా సరిగ్గా పది రోజుల సమయం ఉండడం తో ఇప్పటి నుండి ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయని, అందులో భాగంగా ఈ మూవీ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహనన్ రేపు ఉదయం 9 గంటలకు మీడియా తో ఇంటరాక్ట్ అవ్వబోతుందని, ఆమెతో పాటు మూవీ టీం కూడా ఇక నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ చేయబోతోందని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇక ప్రతీ రోజు పండగే అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై హైప్ తారా స్థాయిలో ఉంది. ఈ ప్రొమోషన్స్ తో మేకర్స్ అంచనాలను ఇంకా ఏ రేంజ్ కి తీసుకెళ్తారో అని అభిమానులు ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.
THAT’S IT. THAT’S THE TWEET. #OG #TheyCallHimOG pic.twitter.com/R7xKe8IA9O
— DVV Entertainment (@DVVMovies) September 14, 2025