Chiranjeevi-Rajinikanth: సౌత్ ఇండియాలో రజినీకాంత్ తిరుగులేని స్టార్. దేశంలోనే ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఆయన్ని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ ని శాసించే అమితాబ్, షారుక్, సల్మాన్ లాంటి హీరోలకు కూడా దేశవ్యాప్తంగా మార్కెట్ లేదు. కానీ రజినీకాంత్ పాన్ ఇండియా చిత్రాలతో వసూళ్ల వర్షం కురిపించారు. ఇక సౌత్ నుండి రజినీకాంత్ తర్వాత అంతటి స్టార్ డమ్ సాధించిన హీరో చిరంజీవి. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోగా ఆయన ఏకఛత్రాధిపత్యం చేశారు, చేస్తున్నారు.

90లలో స్టార్ హీరోగా ఫుల్ ఫార్మ్ లో ఉన్న చిరంజీవి కోటి రూపాయలకు పైగా పారితోషికం తీసుకొని రికార్డు నెలకొల్పారు. చిరు కోటి రూపాయలు తీసుకుంటున్న సమయంలో అమితాబ్, రజినీ కూడా అంత మొత్తం తీసుకోవడం లేదు. హిందీలో కూడా చిత్రాలు చేసిన చిరంజీవి.. అక్కడ కూడా తన మార్క్ క్రియేట్ చేయాలని చూశారు. అయితే ఆయన పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు.
దాదాపు ఒకే జనరేషన్ కి చెందిన చిరంజీవి, రజినీకాంత్ వెండితెరపై తిరుగులేని శక్తులుగా, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్స్ గా ఎదిగారు. ఈ ఇద్దరు టాప్ స్టార్స్ మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సామాన్యులుగా వచ్చి, పరిశ్రమలో స్థిరపడ్డారు. హీరోలు కావాలనే ఆశతో చెన్నై వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నారు.
ఇక వీరిద్దరిలో ఉన్న మరొక కామన్ పాయింట్ విలన్స్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోలుగా ఎదిగారు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించారు. తర్వాత తన టాలెంట్ తో హీరోగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. రజినీ కెరీర్ కూడా ఇలానే సాగింది. ఆయనకు కూడా మొదట్లో హీరో అవకాశాలు రాలేదు. విలన్ గా చేసి, నటుడిగా నిరూపించుకుని, హీరోగా అవకాశాలు దక్కించుకున్నారు.
Also Read: సూపర్‌స్టార్ తలైవా రజనీకాంత్ పుట్టిరోజు నేడు.. విషెష్ తెలిపిన ప్రముఖులు
ఇక హీరోలుగా వెండితెరపై చరిత్ర లిఖించిన చిరు, రజినీకాంత్ రాజకీయాలలో మాత్రం అట్టర్ ప్లాప్. చిరంజీవి పీఆర్పీ పార్టీ స్థాపించి… 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. అనుకున్న ఫలితాలు రాకపోవడంతో సీఎం పీఠంపై ఆశ వదిలేసి రాజకీయాల నుండి తప్పుకున్నారు. రజినీకాంత్ విషయానికి వస్తే.. రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పి, అనూహ్యంగా వెనకడుగు వేశాడు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ విషయంలో చిరు, రజినీకాంత్ అభిమానులను పూర్తిగా నిరాశపరిచారు.
Also Read: రజనీకాంత్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?