Sukumar: ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపుని సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. వీళ్ళ కాంబినేషన్లో ఇంతకుముందే రంగస్థలం లాంటి గొప్ప సినిమా వచ్చింది. ఈ సినిమాతో రామ్ చరణ్ లోని పూర్తిస్థాయి నటుడు బయటికి వచ్చాడు. తను ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో వెంకీ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చేసి చూపించాడు. చిట్టిబాబు అనే ఒక చెవిటి వాడి పాత్ర ను ఆయన పెర్ఫెక్ట్ గా పోట్రే చేసిన విధానం అద్భుతంగా ఉంది. అందుకే ఈ సినిమా ద్వారా గొప్ప గుర్తింపైతే వచ్చింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. సుకుమార్ మాత్రం రంగస్థలం ఇచ్చిన సక్సెస్ డోస్ సరిపోకపోవడంతో పుష్ప సిరీస్ చేసి ప్రేక్షకులందరిని ఆశ్చర్యపరిచాడు.
అలాగే బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాశాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా కూడా వింటేజ్ లవ్ స్టోరీ గా తెలుస్తోంది. మరి ఆయన వింటేజ్ స్టోరీలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక లవ్ స్టోరీలను తను డీల్ చేసినంత పర్ఫెక్ట్ గా ఇంకే దర్శకుడు డీల్ చేయలేడు అనే ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు.
కాబట్టి ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తో పాటు పాన్ వరల్డ్ స్థాయిని కూడా మెప్పించగలిగాలి అంటు పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… సుకుమార్ తన స్టాండర్డ్ ని నమ్ముకొని కథలో ఎలాగైతే క్యారెక్టరైజేషన్స్ ని బిల్డ్ చేసుకుంటూ కథ మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకు సాగుతాడో ఇకమీదట అలాగే సాగితే అతనికి సక్సెస్ ఈజీగా వస్తోంది.
ఇక అలా కాకుండా హంగులు, ఆర్భాటాలకు పోయి కథ మీద ఫోకస్ చేయకపోతే మాత్రం ఆయన తీవ్రంగా దెబ్బ తినాల్సిన అవసరమైతే రావచ్చు. ‘పుష్ప 2’ సినిమాలో కథ పెద్దగా ఉండకపోవడంతో ఆయన కొంతవరకు విమర్శలను మూటగట్టుకున్నాడు. ‘పుష్ప 2’ సినిమా మీద ఉన్న హైప్ తో ఆ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. కాబట్టి తను కథ విషయంలో కాంప్రమైజ్ అయితే సినిమా సక్సెస్ అవ్వడం కష్టమవుతోంది…