Airlines In India: ఇటీవల ఇండిగో సంస్థ చేసిన నిర్వాకం వల్ల దేశంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు గంటల తరబడి పడికాపులు కాయాల్సి వచ్చింది. దీంతో భారత్ పరువు పోయింది. ఫలితంగా భారత ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ప్రతిపక్షాల అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాయి. ఒకానొక దశలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇండిగో సంస్థ ఇచ్చిన షాక్ నుంచి కేంద్ర ప్రభుత్వం త్వరగానే మేల్కొంది. నేపథ్యంలో దేశంలో మరో రెండు విమాన సంస్థలకు పౌర విమానయాన శాఖ అనుమతులు ఇచ్చింది. ఆల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ ప్రెస్ సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పౌర విమానయాన శాఖ నుంచి ఈ సంస్థలకు నిరభ్యంతర పత్రాలు కూడా మంజూరయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో సంస్థ శంక్ ఎయిర్ అనే సంస్థకు కూడా ఇప్పటికే కేంద్రం నిరంతర పత్రం ఇచ్చింది. వచ్చేయడాల నుంచి ఆ సంస్థ కార్యకలాపాలు మొదలు పెట్టనుంది.
ఇటీవల దేశీయ ఇండిగో సంస్థలో సంక్షోభం ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా కొద్ది రోజులపాటు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అనేకమంది ప్రయాణికులు విమానాశ్రయాలలో చిక్కుకుపోయారు. ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో సుదీర్ఘంగా ప్రసంగించారు. విమానయాన రంగంలో ఏ సంస్థ పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించడానికి తాను ఆస్కారం ఇవ్వడం లేదని.. ఇంకా చాలా సంస్థలను ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు కొత్త సంస్థలు కార్యకలాపాలు సాగించడానికి ఇదే అనుకూలమైన సందర్భం అని ఆయన పేర్కొన్నారు. ఇక మన దేశంలోని విమానయాన రంగంలో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు 90% వాటా కలిగి ఉన్నాయి. ఇందులో ఇండిగో కే 65% వాటా ఉండడం విశేషం.
కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల నేపథ్యంలో ఇండిగో సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్వీసులను అప్పటికప్పుడు రద్దు చేసింది. కొన్ని సర్వీస్లను దారి మళ్ళించింది. దీంతో దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలలో ప్రయాణికులు నరకం చూశారు. సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయాలకే పరిమితం కావలసి వచ్చింది. ఈ పరిణామం నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయం పట్ల ప్రయాణికులనుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతుంది. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకొని ఉంటే బాగుండేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు.