Bangladesh: సరిగ్గా గత ఏడాది ఇదే సమయానికి బంగ్లాదేశ్ దేశంలో అల్లర్లు చెలరేగాయి. ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనస్ ను నియమించారు.. అతని పరిపాలన లో బంగ్లాదేశ్ లో అల్లర్లు ఏమాత్రం తగ్గలేదు. పరిస్థితిలో కూడా ఏమాత్రం మార్పు రాలేదు. అంతే కాదు ఇప్పుడు ఆ దేశంలో మహమ్మద్ యూనస్ కూడా దేశం వదిలి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
బంగ్లాదేశ్లో ఇటీవల యువ నేత ఉస్మాన్ హాది హత్యకు గురయ్యాడు. అంతేకాదు అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించారు. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామం కాస్త యూనస్ ను తీవ్రమైన చిక్కుల్లో పడేసింది. బంగ్లాదేశ్ లో యువ నాయకుడిగా షరీఫ్ ఉస్మాన్ హాదీ కొనసాగుతున్నారు. షేక్ హసీనా దేశం వదిలిపెట్టి వెళ్లిపోవడంలో హాది కీలకపాత్ర పోషించారు. ఇటీవల హాది హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్లో ఆయన ఇంకిలాబ్ మొంచో అనే సంస్థను నడుపుతున్నారు.
హాది హత్యకు గురి కావడంతో బంగ్లాదేశ్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హాది హత్యపై అతడి సోదరుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. హాది హత్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించాడు. అతని హత్యను ఉపయోగించుకుని, వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయాలని చూస్తుందని అతడు ఆరోపించాడు. తన సోదరుడు హత్యపై దర్యాప్తు జరపాలని, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై చీకటి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ ఘటనపై తమ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ విడిచి వెళ్లి పోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ఉద్దేశించి హాది సోదరుడు ఒమర్ హెచ్చరించారు.
హసీనాకు సంబంధించిన ఆవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ నిషేధం విధించడం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.. స్వేచ్ఛాయుత విధానంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు బంగ్లాదేశ్ పౌరులకు ఉండాల్సిందేనని అమెరికాలోని కొంతమంది చట్టసభ్యులు డిమాండ్ చేశారు. తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో అని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికల నిర్వహించాలని సూచించారు. అంతేకాదు అవామీ లీగ్ పై విధించిన నిషేధాన్ని మరోసారి సమీక్షించాలని సూచించారు.
ఇక బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఆ దేశంలో అనేక మీడియా సంస్థల కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులు చేశారు.. బంగ్లాదేశ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ టీవీ కార్యాలయానికి ఆందోళనకారులు బెదిరింపులకు పాల్పడ్డారు. గ్లోబల్ టీవీ హెడ్ స్థానం నుంచి నాజ్నిన్ మున్నీ ని తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమెను అలానే కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు.