Homeఎంటర్టైన్మెంట్The Last of Us Season 2 Episode 4: ది లాస్ట్ ఆఫ్ అజ్...

The Last of Us Season 2 Episode 4: ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 ఎపిసోడ్ 4 రివ్యూ: ఆడియన్స్ రియాక్షన్ ఇదే!

The Last of Us Season 2 Episode 4: మోస్ట్ సక్సెస్ఫుల్ హాలీవుడ్ సిరీస్ ‘ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2’ ఎపిసోడ్ 4 అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేష్ఠునారు. విమర్శకులు ఇప్పటి వరకు విడుదలైన ది లాస్ట్ ఆఫ్ అజ్ ఎపిసోడ్స్ లోనే అత్యంత అద్భుతమైన ఎపిసోడ్ అని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఆడియన్స్ లో మాత్రం భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

Also Read: హరి హర వీరమల్లు కి త్రివిక్రమ్ ఫినిషింగ్ టచ్!

ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 ఎపిసోడ్ 4లో ప్రధాన ఆకర్షణ ఇసాక్ పాత్ర. ఇసాక్ పాత్ర చేసిన జెఫ్రీ రైట్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. WLF లీడర్ అయిన ఇసాక్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడని విమర్శకులు ప్రసంసలు కురిపిస్తున్నారు. జెఫ్రీ కట్టి పడేసే నటన, ప్రజెన్స్ హైలెట్ గా నిలిచాయి. FEDRA ను వదిలేసి WLF కి లీడర్ అవుతాడు ఇసాక్. యాక్షన్ ఎపిసోడ్స్ సైతం ఆకట్టుకుంటాయి.

గత సీజన్స్ వలె కాకుండా హారర్, యాక్షన్ ని లేటెస్ట్ ఎపిసోడ్ లో బాగా బ్యాలన్స్ చేశారు.. అని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. లేటెస్ట్ ఎపిసోడ్ పర్లేదు. వార్ క్రైమ్స్ ని ఒక అందమైన ప్రేమకథతో పాటు చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సీజన్ 2 కేవలం 7 ఎపిసోడ్స్ మాత్రమే కలిగి ఉంది.. అని మరొక క్రిటిక్ రాసుకొచ్చాడు.

ఈ ఎపిసోడ్ లో ఈ ప్రపంచంలో ఇప్పటికీ మిగిలి ఉన్న కాంతిని అందాన్ని చూపిస్తుంది. అదే సమయంలో ఈ ప్రపంచంలోని చీకటి కోణాన్ని, భయానక పరిస్థితులను తెలియజేశారు, అని మరొక క్రిటిక్ రాసుకొచ్చాడు. విమర్శకులు పాజిటివ్ రివ్యూస్ ఇస్తుండగా, ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేయడం కొసమెరుపు.

ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 ఎపిసోడ్ 4 లో విషయం లేదు, అని కామెంట్ చేసిన ఓ నెటిజన్ ట్విట్టర్ ఎక్స్ లో అయోమయంతో కూడిన మీమ్స్ పోస్ట్ చేశాడు. ఈ సిరీస్ మొత్తం ఒక ట్రాష్. అసలు నేను నాలుగు ఎపిసోడ్స్ ఎలా చూడగలిగాను, అనే సందేహం కలుగుతుంది, అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 ఎపిసోడ్ 4 మొత్తంగా డాగ్ షిట్ అంటూ మరొక నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు. మరొక ప్రేక్షకులు పర్లేదు. ఇసాక్ పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది, అని రాసుకొచ్చాడు.

Also Read: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిని పరిచయం చేయనున్న ఆర్ఎక్స్ 100 డైరెక్టర్, క్రేజీ న్యూస్!

Exit mobile version