Pawan Kalyan and Prakash Raj : బిజెపి ( Bhartiya Janata Party) విధానాలపై విరుచుకుపడుతుంటారు నటుడు ప్రకాష్ రాజ్. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మిత్రపక్షాలను సైతం ఆయన విడిచిపెట్టరు. ఆది నుంచి బిజెపి వ్యతిరేక భావజాలంతో ముందుకెళ్లారు. సమకాలీన రాజకీయ అంశాలపై ప్రకాష్ రాజ్ కు అవగాహన కూడా ఉంది. ఆది నుంచి రాజకీయాల పట్ల కూడా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి కూడా. సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. బిజెపి విధానాలను తొలినుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. బిజెపికి మద్దతుగా నిలిచే నేతలను సైతం విడిచి పెట్టేవారు కాదు. ఈ క్రమంలోనే తన మిత్రుడు పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేయడం ప్రారంభించారు.
Also Read : 30 వ తేదీన ఇండియాకు వస్తాను..మీ లెక్క ఏంటో తెలుస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ స్పందన!
* పవన్ టార్గెట్ వెనుక..
ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. చాలా అంశాల్లో బిజెపికి మద్దతుగా మాట్లాడుతుంటారు పవన్. ఈ క్రమంలోనే ఆయన పవన్ కళ్యాణ్ కు టార్గెట్ అయ్యారు. ముఖ్యంగా పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరం అని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు తిరుమల లడ్డు వివాదంపై కూడా పవన్ జాతీయ స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వాటన్నింటినీ తిప్పి కొట్టడం ప్రారంభించారు పవన్ కళ్యాణ్. నిత్యం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్నారు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో ఆయన జనసేనకు కూడా వ్యతిరేకంగా మారిపోయారు. అయితే సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ పై ఎనలేని అభిమానం చూపిన ప్రకాష్ రాజ్.. రాజకీయంగా మాత్రం విభేదిస్తున్నారు.
* ఇండిపెండెంట్ గా ఓటమి
ఆది నుంచి రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉండేవారు ప్రకాష్ రాజ్( actor Prakash Raj). ఏదో ఒక పార్టీలో చేరతారని అంతా భావించారు. అదే సమయంలో తమిళ సినీ నటులు పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలను స్థాపించారు. దీంతో ప్రకాష్ రాజ్ సైతం పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ప్రకాష్ రాజ్ 2019 ఎన్నికల్లో.. స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్ నుంచి బరిలో దిగారు. కానీ దారుణ పరాజయం చవిచూశారు. ఆయనకు కేవలం 28,9 06 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొద్దిరోజుల పాటు సైలెంట్ అయిన ప్రకాష్ రాజ్.. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇటీవల బాలీవుడ్ పై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ ఇండస్ట్రీలో సగానికి పైగా సెలబ్రిటీలు అధికార ఎన్డీఏకు అమ్ముడుపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలపై సినీ పరిశ్రమకు చెందిన వారు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేవలం నిజాలు మాట్లాడినందుకే తనకు అవకాశాలు తగ్గాయని చెప్పారు ప్రకాష్ రాజ్.
Also Read : అభిమానులకు క్లాస్ ఇచ్చిన పవన్.. అధికారం కోసం తప్పదు మరీ?
* బిజెపి నేత కౌంటర్..
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ( Pawan Kalyan)విమర్శలు కొనసాగిస్తున్నారు ప్రకాష్ రాజ్. రెండు రోజుల కిందట మరోసారి పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపితో పవన్ ప్రయాణం ముంబై లోకల్ ట్రైన్ జర్నీ లాంటిదని.. సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. పవన్ కు ఏం తెలియదని.. బిజెపి వాళ్లే ఎక్కించారని.. వాళ్లే దించేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపితో పాటు జనసేన క్యాడర్ ఆగ్రహంగా ఉంది. దీనిపై తాజాగా బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. బిజెపి పై నిత్యం విమర్శలు చేయడమే మీ పని అంటూ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి వార్తల్లో నిలవడం తప్ప.. నిజంగా మీరు ఏం సాధించారు అని ప్రకాష్ రాజ్ ను నిలదీశారు విష్ణువర్ధన్ రెడ్డి. రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం హోదాకు పవన్ ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఓడిపోయిన వారు సైలెంట్ గా ఉండాలని.. ప్రకాష్ రాజ్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కామెంట్స్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి.