Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఆయన కమిటైన చిత్రాల షూటింగ్ ఆలస్యమైంది. వాటిలో హరి హర వీరమల్లు ఒకటి. దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దాదాపు 80 శాతం షూటింగ్ ఆయన పూర్తి చేశాడు. అంతకంతకు హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఆయన తప్పుకున్నారు. దాంతో దర్శకుడు జ్యోతికృష్ణ హరి హర వీరమల్లు బాధ్యత తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో చివరి రెండు రోజుల షెడ్యూల్ పూర్తి అయ్యింది. దాంతో గుమ్మడికాయ కొట్టేశారు. కాగా చివరి షెడ్యూల్ కి త్రివిక్రమ్ హాజరయ్యారట. ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేసినట్లు వినికిడి.
Also Read : అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీం మౌనం..అసలు ఏమి జరుగుతుంది?
ఇక హరి హర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్, ట్రైలర్ కట్ వంటి విషయాల్లో కూడా త్రివిక్రమ్ జోక్యం ఉండనుందట. హరి హర వీరమల్లుకి త్రివిక్రమ్ చివర్లో తనదైన మెరుగులు దిద్దనున్నాడట. ఈ న్యూస్ పవన్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ లది హిట్ కాంబినేషన్. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ వీరి కాంబోలో తెరకెక్కాయి. అజ్ఞాతవాసి మాత్రం నిరాశపరిచింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించారు. ఈ సినిమాలకు సైతం త్రివిక్రమ్ పని చేశారు.
త్రివిక్రమ్ ఎంట్రీతో హరి హర వీరమల్లు పై అంచనాలు పెరిగాయి. త్రివిక్రమ్ సలహాలు సూచనలు హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ కి ప్లస్ అవుతాయని అంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ అల్లు అర్జున్, వెంకటేష్ చిత్రాలకు స్క్రిప్ట్ పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. అంతటి బిజీలో కూడా ఆయన హరి హర వీరమల్లుకు సమయం కేటాయిస్తున్నారట. ఇక హరి హర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ మూవీ. పవన్ కళ్యాణ్ మొఘలుల కాలం నాటి బందిపోటు రోల్ చేస్తున్నాడు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఓజీ సైతం పూర్తి చేయాల్సి ఉంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. డివివి దానయ్య ఓ జీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read : హరి హర వీరమల్లు’ కి హాలీవుడ్ హీరో ‘టామ్ క్రూజ్’ గండం..ఇలా అయితే కష్టమే!