Ravi Teja Khiladi Movie: ప్చ్.. బాక్సాఫీస్ వద్ద ‘ఖిలాడీ’ పరిస్థితి దారుణం

Ravi Teja Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ కొత్త మూవీ ‘ఖిలాడీ’ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించినా.. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఇద్దరూ ఎక్స్ పోజింగ్ విషయంలో పోటీ పడినా ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. రమేష్ వర్మ దర్శకత్వం కూడా ఈ సినిమాకి బాగా మైనస్ అయింది. ఇక ఈ సినిమా కోసం చేసిన […]

Written By: Shiva, Updated On : February 18, 2022 11:17 am
Follow us on

Ravi Teja Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ కొత్త మూవీ ‘ఖిలాడీ’ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించినా.. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఇద్దరూ ఎక్స్ పోజింగ్ విషయంలో పోటీ పడినా ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. రమేష్ వర్మ దర్శకత్వం కూడా ఈ సినిమాకి బాగా మైనస్ అయింది.

Khiladi

ఇక ఈ సినిమా కోసం చేసిన భారీ ప్రమోషన్స్ లో.. సగం స్క్రిప్ట్ పై పెట్టినా సినిమా బెటర్ గా ఉండేది. మొత్తానికి రవితేజ ఇచ్చిన అవకాశాన్ని రమేష్ వర్మ వాడుకోలేకపోయాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా దారుణంగా పరాజయం పాలు అయింది. ఈ సినిమా ఇక బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. మరి లేటెస్ట్ కలేక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Also Read:   శృతి హాసన్ ను ఫోన్‌ నంబర్‌ అడిగితే.. సూపర్ రిప్లై ఇచ్చింది

ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ల వివరాలను ఒకసారి గమనిస్తే :

గుంటూరు 0.98 కోట్లు
కృష్ణా 0.53 కోట్లు
నెల్లూరు 0.48 కోట్లు
నైజాం 3.61 కోట్లు
సీడెడ్ 1.56 కోట్లు
ఉత్తరాంధ్ర 1.36 కోట్లు
ఈస్ట్ 0.71 కోట్లు
వెస్ట్ 0.59 కోట్లు

ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 9.82 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.85 కోట్లు

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 11.67 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

Khiladi

మొత్తమ్మీద ‘ఖిలాడీ’ సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. నిజానికి ఈ సినిమాకి రూ.22.3 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ ఉంది. అయితే, అది ఎంతవరకు నిజం అనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి లెక్కల ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. కానీ, 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.11.67 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కు మరో రూ.11.33 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాలి. అది ఇక అసాధ్యమే. మొత్తానికి రవితేజ ‘ఖిలాడీ’ పరిస్థితి బాక్సాఫీస్ దారుణమే అనుకోవాలి.

Also Read: తెలుగు రాష్ట్రాల డబ్బుల పంచాయితీ తీరేనా?

Tags