https://oktelugu.com/

DJ Tillu Box office : యంగ్ హీరోకి సాలిడ్ హిట్ పడినట్టే

DJ Tillu: యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రిలీజ్ అయిన కొత్త చిత్రం ‘డీజే టిల్లు’. ఇక ఈ సినిమాకి ‘అట్లుంటది మనతోని’ అనేది ఉపశీర్షిక. కాగా ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయిక నటించింది. కొత్త దర్శకుడు విమల్‌ కృష్ణ ఈ సినిమాను చక్కగా డైరెక్ట్ చేయడంతో.. మొదటి షోతోనే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హిట్ టాక్ కారణంగా ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి. దాంతో మొదటి […]

Written By:
  • Shiva
  • , Updated On : February 18, 2022 / 11:10 AM IST
    Follow us on

    DJ Tillu: యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రిలీజ్ అయిన కొత్త చిత్రం ‘డీజే టిల్లు’. ఇక ఈ సినిమాకి ‘అట్లుంటది మనతోని’ అనేది ఉపశీర్షిక. కాగా ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయిక నటించింది. కొత్త దర్శకుడు విమల్‌ కృష్ణ ఈ సినిమాను చక్కగా డైరెక్ట్ చేయడంతో.. మొదటి షోతోనే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హిట్ టాక్ కారణంగా ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

    DJ Tillu

    దాంతో మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటడం విశేషం. ఇక 4వ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను కలెక్ట్ చేసింది. మరి ఫస్ట్ డే నుంచి ఈ సినిమా నేటి వరకు ఏ రేంజ్ లో కలెక్ట్ చేసిందో.. అలాగే లేటెస్ట్ కలేక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

    Also Read:   నూత‌న జిల్లాల ఏర్పాటుతో వైసీపీకి త‌ల‌నొప్పులేనా?

    ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్ల వివరాలను ఒకసారి గమనిస్తే :

    గుంటూరు 0.43 కోట్లు
    కృష్ణా 0.36 కోట్లు
    నెల్లూరు 0.25 కోట్లు
    నైజాం 4.33 కోట్లు
    సీడెడ్ 1.06 కోట్లు
    ఉత్తరాంధ్ర 0.77 కోట్లు
    ఈస్ట్ 0.47 కోట్లు
    వెస్ట్ 0.56 కోట్లు

    ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 8.25 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా 2.25 కోట్లు
    ఓవర్సీస్ 1.48 కోట్లు

    ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 10.50 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

    DJ Tillu

    అన్నట్టు ఈ ‘డిజె టిల్లు’ సినిమాకు మొత్తం బాక్సాఫీస్ వద్ద రూ.8.98 కోట్ల బిజినెస్ జరిగింది. కాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు 9.2 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. అయితే, 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.10.50 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1.3 కోట్ల లాభాలను అందించింది. మొత్తానికి సిద్ధు జొన్నలగడ్డకి సాలిడ్ హిట్ పడినట్టే.

    Also Read: తెలుగు రాష్ట్రాల డబ్బుల పంచాయితీ తీరేనా?

    Tags