KCR To Visit Medaram Jatara: మేడారం జాతర సంరంభం కొనసాగుతోంది. సమ్మక్క, సారలమ్మ దేవతలు గద్దెలపై కొలువు దీరడంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క గద్దెలపైకి రావడంతో భక్తజనం అమ్మలను దర్శించుకుంటున్నారు. తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తూ బంగారం సమర్పించుకుంటున్నారు. రేపు సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయనుండటంతో ఇవాళ అందరు మొక్కులు చెల్లించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమ్మలను దర్శించుకునేందుకు విచ్చేయనున్నారు. హెలికాప్టర్ ద్వారా నేరుగా మేడారం చేరుకుంటారు. అనంతరం దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. సతీసమేతంగా రావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేశారు . క్యూ లైన్లలో జనం భారీగా ఉండటంతో వారిని కంట్రోల్ చేయనున్నారు.
Also Read: Medaram Jatara 2022: నేడే మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తులు
సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కోటికి పైగా భక్తులు రావడంతో అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో తలమునకలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు కల్పించారు. పరిసరాలను తమ అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Medaram Jatara 2022: మేడారం వెళ్లే భక్తులకు తీపికబురు.. మీ ఇంటి ముందుకే ఆర్టీసీ బస్సు సర్వీస్!
సీఎం వచ్చి వెళ్లే వరకు కూడా భద్రతా చర్యలను ముమ్మరం చేయనున్నారు. సీఎంకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. నేరుగా ఆయన గద్దెల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం జాతర ప్రాంగణాన్ని తమ కనుసన్నల్లో ఉంచుతున్నారు.
Also Read:
1. KTR Birthday Wishes To KCR: సీఎం తన తండ్రి కావడం ఓ అదృష్టమేః కేటీఆర్ ట్వీట్
2. CM KCR Birthday: కేసీఆర్ బర్త్ డే స్పెషల్: 68వ వసంతంలోకి టీఆర్ఎస్ బాస్