పైచేయి ఎవరిది: జగన్ పంతం.. రఘురామ పలుకుబడి

రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు వేసేందుకు వైసీపీ ఎంపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో మరోసారి స్పీకర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇక సీఎం జగన్ స్వయంగా కేంద్రమంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొచ్చినట్టు వార్తలువచ్చాయి. దీంతో ఎంపీ రఘురామ కూడా కాస్త ఆందోళనతోనే ప్రకటన చేశాడు. రఘురామ తాజాగా కీలక ప్రకటన చేశాడు. ‘తాను ఏ పార్టీతోనూ జట్టు కట్టలేదని.. అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని అన్నారు. వైసీపీ ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంట్ […]

Written By: NARESH, Updated On : June 12, 2021 12:30 pm
Follow us on

రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు వేసేందుకు వైసీపీ ఎంపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో మరోసారి స్పీకర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇక సీఎం జగన్ స్వయంగా కేంద్రమంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొచ్చినట్టు వార్తలువచ్చాయి. దీంతో ఎంపీ రఘురామ కూడా కాస్త ఆందోళనతోనే ప్రకటన చేశాడు.

రఘురామ తాజాగా కీలక ప్రకటన చేశాడు. ‘తాను ఏ పార్టీతోనూ జట్టు కట్టలేదని.. అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని అన్నారు. వైసీపీ ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ సభాపతి ఓం బిర్లాకు లోక్ సభ లో వైసీపీ విప్ మార్గాని భరత్ శుక్రవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై రఘురామ సైతం స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలితాల అమలులో లోపాలను మాత్రమే తాను ప్రస్తావించానని.. తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని వివరించారు. తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశానని.. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని.. నాపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివేలేజ్ మోషన్ ఇస్తానని రఘురామ తెలిపారు.

రఘురామ ఎంపీ పోస్టు ఎలాగైనా ఊస్ట్ చేయాలని వైసీపీ కేంద్రంలో లాబీయింగ్ చేస్తోంది. అటు వైసీపీ ఎంపీలు.. ఇటు సీఎం జగన్ సైతం అమిత్ షా తో భేటి అయ్యి ఈ మేరకు విన్నవించినట్టు తెలిసింది. మరోవైపు తనపై వేటు వేస్తే ఖచ్చితంగా దాన్ని కోర్టుకెళ్లి అడ్డుకునేందుకు రఘురామ కాచుకు కూర్చున్నారని తెలుస్తోంది.

మరీ ఈ ఫైట్ లో జగన్ పంతం నెగ్గుతుందా? రఘురామ పలుకుబడి పనిచేస్తుందా? అన్నది వేచిచూడాలి.