రెండోపెళ్లిపై స్పందించిన హీరోయిన్

అప్పట్లో టాలీవుడ్ ను ఊపు ఊపిన హీరోయిన్ ప్రేమ.తెలుగు, తమిళం, కన్నడం సినీ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ నిజ జీవితంలో మాత్రం చాలా కష్టాలను అనుభవించింది. ఈ సీనియర్ హీరోయిన్ 2006 సంవత్సరంలో వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. ఒక దశాబ్దం తరువాత ఆమె విడాకులు తీసుకుంది. ప్రేమా ఒంటరిగా ఉండి ఇప్పుడు ఐదేళ్ళు అవుతోంది. ఆమె త్వరలోనే రెండవ సారి వివాహ బంధంలోకి ప్రవేశిస్తుందని వార్తలు వెలువడ్డాయి.. అయితే ఈ నివేదికలు ఎక్కడి […]

Written By: NARESH, Updated On : June 3, 2021 5:13 pm
Follow us on

అప్పట్లో టాలీవుడ్ ను ఊపు ఊపిన హీరోయిన్ ప్రేమ.తెలుగు, తమిళం, కన్నడం సినీ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ నిజ జీవితంలో మాత్రం చాలా కష్టాలను అనుభవించింది. ఈ సీనియర్ హీరోయిన్ 2006 సంవత్సరంలో వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. ఒక దశాబ్దం తరువాత ఆమె విడాకులు తీసుకుంది. ప్రేమా ఒంటరిగా ఉండి ఇప్పుడు ఐదేళ్ళు అవుతోంది. ఆమె త్వరలోనే రెండవ సారి వివాహ బంధంలోకి ప్రవేశిస్తుందని వార్తలు వెలువడ్డాయి.. అయితే ఈ నివేదికలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానికి స్పష్టత లేదు.

తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రేమ చాలా రోజుల తరువాత వార్తల్లోకెక్కింది. ప్రేమ రెండో పెళ్లి చేసుకుంటోందన్న వార్తలు బయటికి రావడంతో సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.. ఈ మధ్య మొదటి పెళ్లి చేసుకున్న నటీమణులు రెండో పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలు ప్రచారం కావడంతో ప్రేమ కూడా అదేబాటలో నడుస్తోందని ప్రచారం సాగుతోంది.

నటి ప్రేమ కూడా రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలువచ్చాయి. 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచును ప్రేమ పెళ్లి చేసుకుంది. 10 సంవత్సరాల పాటు కలిసున్న వీరు ఆ తరువాత విభేదాలు వచ్చి విడిపోయారు. అప్పటి నుంచి ప్రేమ ఒంటిరిగానే ఉంటోంది. ఇక ఆమె క్యాన్సర్ తో బాధపడుతుందని కొందరు వార్తలు ప్రచారం చేశారు. దీంతో ప్రేమ ఈ వార్తలపై స్పందించింది. ప్రస్తుతం తాను ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదని, ఒంటరి లైఫే బెటర్ గా ఉందని చెప్పింది.

అంతేకాకుండా తనకు ఏలాంటి జబ్బు లేదని, ఆరోగ్యంగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు సినీ ప్రియుల్లో ఉన్న అయోమయం తొలగింది. కన్నడ సినీ పరిశ్రమలో ‘సవ్యసాచి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రేమ ఆ తరువాత తెలుగులో రాజశేఖర్ నటించిన ఓంకారం సినిమాతో అడుగుపెట్టింది. దేవి, కోరుకున్న ప్రియుడు సినిమాలతో పాపులారిటి సాధించింది.