Pre Wedding Show Movie Teaser Talk: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా చాలామంది ప్రేక్షకులు ఆ సినిమాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్బంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ప్రస్తుతం ప్రతి సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోంది. కాబట్టి ఇండియాలో ఉన్న ప్రతి ఆడియన్ కూడా ఈ సినిమాను చూస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక ఇప్పటివరకు పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోలు చేస్తున్న సినిమాలు కూడా చాలా మంచి ఆదరణను సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా తిరువీర్ లాంటి హీరో మంచి కథలను ఎంచుకొని సినిమాలను చేస్తుడు. ఇక ఇప్పటికే ఆయన జార్జ్ రెడ్డి, మసుదా లాంటి సినిమాలైతే చేశాడు. ఈ సినిమాలతో ఆయనకు చాలా మంచి గుర్తింపు అయితే లభించింది. తన వల్లే ఆయన ఇండస్ట్రీలో కొత్త కథలను ఎంచుకొని సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఇప్పుడు ‘ప్రీ వెడ్డింగ్ షో’ అనే సినిమా వస్తుంది. మరి ఈ సినిమా నుంచి గత కొద్దిసేపటి క్రితమే ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉంది. ఈ మూవీ ని కామెడీ జానర్లలో తెరకెక్కించాడు. ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో పెళ్లి కి ముందు ‘ప్రీ వెడ్డింగ్ షో’ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి…
ముఖ్యంగా కెమెరా మెన్స్ కి వచ్చే కష్టాలు ఏంటి..? ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈ సినిమాలో ఫన్నీ గా చూపించే ప్రయత్నం అయితే చేశారు…ఇక ఈ సినిమా విషయంలో తిరువీర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది…ఇక తిరువీర్ కొత్త దర్శకులతో ఎక్కువ సినిమాలను చేస్తూ వాళ్లకు కూడా మంచి అవకాశాలను కల్పిస్తున్నాడు…
ఇక ఏది ఏమైనా కూడా లో బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి మరికొన్ని చిన్న సినిమాలకు లైఫ్ ఇస్తోంది అంటూ చాలా మంది కోరుకుంటున్నారు. ఇక ఈ ఇయర్ లో వచ్చిన అన్ని చిన్న సినిమాలకంటే ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆ బాటలోనే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తే నిజంగా ఇండస్ట్రీ కి మంచి రోజులు వస్తాయనే చెప్పాలి…