Kubera Movie: నాగార్జున కుబేర సినిమా మీద పెట్టిన ఫోకస్ 100 వ సినిమా మీద పెట్టడం లేదా..కారణం ఏంటి..?

Kubera Movie: ఇక ఇప్పుడు ఆయన వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే గత కొద్దిరోజుల నుంచి ఆయనకు వరుసగా ఫ్లాపులైతే వస్తున్నాయి. ఇక దానివల్ల ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా చాలా స్పెషల్ గా ఉండాలనే ఉద్దేశ్యం తోనే చాలా మంచి స్టోరీస్ కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: NARESH, Updated On : June 1, 2024 9:52 pm

Kubera Movie

Follow us on

Kubera Movie: అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ‘శివ ‘ సినిమాతో ఒకసారిగా మాస్ హీరోగా అవతారం ఎత్తిన ఆయన, ఆ తర్వాత క్లాస్ మాస్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు…

ఇక ఇప్పుడు ఆయన వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే గత కొద్దిరోజుల నుంచి ఆయనకు వరుసగా ఫ్లాపులైతే వస్తున్నాయి. ఇక దానివల్ల ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా చాలా స్పెషల్ గా ఉండాలనే ఉద్దేశ్యం తోనే చాలా మంచి స్టోరీస్ కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న ‘కుబేర ‘ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కూడా వస్తుందనే అంచనాలైతే పెట్టుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే తన 100 వ సినిమాతో భారీ హిట్ కొట్టాలనుకున్న నాగార్జున ఇప్పుడు 100 వ సినిమా విషయాన్ని పక్కన పెట్టి కుబేర సినిమా మీదనే తను ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కుబేరలో ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండడమే కాకుండా సరికొత్త నాగార్జున ని కూడా చూడబోతున్నాం అనే విధంగా ఆయన ఒక హింట్ కూడా ఇచ్చాడు.

ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత తన పూర్తి ఫోకస్ 100 వ సినిమా మీద పెట్టి ఆ సినిమాని శరవేగంగా షూటింగ్ జరిపే విధంగా ప్రణాళికలు రూపొందించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ సినిమా దర్శకుడు ఎవరు ఎలాంటి కథతో వందో సినిమా చేస్తున్నాడు అనే విషయాలైతే ఇప్పటివరకు నాగార్జున ప్రకటించలేదు. కాబట్టి ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ తొందర్లోనే వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాని ఎవరు డైరెక్షన్ చేస్తారు అనేది…