https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 సాంగ్స్ లో ఒక్కటి తగ్గుతుందా..?

Pushpa 2: అలాగే సెకండ్ సాంగ్ గా అంటూ 'సూసేకే నా సామి' అంటూ రెండో సాంగ్ కూడా వచ్చింది. అయితే ఈ రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నప్పటికీ పుష్ప మొదటి పార్ట్ లో వచ్చిన సాంగ్స్ తో పోలిస్తే ఈ సాంగ్స్ మాత్రం అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నాయి. పుష్ప మొదటి పార్ట్ లో వచ్చిన ప్రతి సాంగ్ కూడా ప్రేక్షకుల్ని మైమరింపజేసి సూపర్ హిట్టుగా నిలిచాయి.

Written By:
  • NARESH
  • , Updated On : June 1, 2024 / 10:00 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ కూడా అంచనాలు పెంచుతూ వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ గాని, టీజర్ గాని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ గా ‘పుష్ప’ టైటిల్ సాంగ్ వచ్చింది.

    అలాగే సెకండ్ సాంగ్ గా అంటూ ‘సూసేకే నా సామి’ అంటూ రెండో సాంగ్ కూడా వచ్చింది. అయితే ఈ రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నప్పటికీ పుష్ప మొదటి పార్ట్ లో వచ్చిన సాంగ్స్ తో పోలిస్తే ఈ సాంగ్స్ మాత్రం అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నాయి. పుష్ప మొదటి పార్ట్ లో వచ్చిన ప్రతి సాంగ్ కూడా ప్రేక్షకుల్ని మైమరింపజేసి సూపర్ హిట్టుగా నిలిచాయి.

    కానీ ఈ సాంగ్స్ లో మాత్రం ఏదో ఒకటి మిస్ అవుతుంది అంటూ అభిమానులు కూడా ఈ పాటల మీద అంత సంతృప్తిగా అయితే ఉండడం లేదు. ఇక ముఖ్యంగా దేవి ఇచ్చిన ఈ మ్యూజిక్ లో ఆ సోల్ అనేది మిస్ అవుతూ వస్తుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే మొదటి పార్ట్ లో సాంగ్స్ సక్సెస్ అయినంత రేంజ్ లో ఈ పార్ట్ లో అయితే సాంగ్స్ అంత సక్సెస్ కావడం లేదు.

    కాబట్టి ఇక మీదట వచ్చే సాంగ్స్ ఏమైనా సినిమా మీద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా మీద అయితే మంచి బజ్ అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే సాంగ్స్ కూడా చాట్ బ్లాస్టర్ అయినట్టైతే సినిమా మీద హైప్ మరింత పెరుగుతుంది. కాబట్టి ఇక మీదట వచ్చే సాంగ్స్ ఎంత స్పెషల్ గా ఉంటాయి అనేది చూడాలి…