Balakrishna: బాలకృష్ణ యంగ్ హీరోలతో ఫ్రెండ్షిప్ చేయడానికి అసలు కారణం ఇదేనా..?

Balakrishna: ఇక అందులో భాగంగానే రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన యంగ్ హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అంటే ఇష్టమని వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం అంటే తనకు చాలా సరదా అని కూడా చెప్పాడు.

Written By: NARESH, Updated On : June 1, 2024 9:54 pm

BalaKrishna

Follow us on

Balakrishna: నందమూరి నటసింహంగా గుర్తింపు పొందిన బాలయ్య బాబు ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోలతో ఫ్రెండ్షిప్ చేస్తూ తనదైన రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక స్టార్ హీరోగానే కాకుండా ఇండస్ట్రీలో మాస్ సినిమాలు చేసి మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక సీనియర్ హీరో అయిన బాలయ్య సీనియర్లతో ఫ్రెండ్షిప్ చేయకుండా రూటు మార్చి యంగ్ హీరోలు అయిన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడవి శేషు లాంటి కుర్ర హీరోలతో మంచి ఫ్రెండ్షిప్ అయితే చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన యంగ్ హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అంటే ఇష్టమని వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం అంటే తనకు చాలా సరదా అని కూడా చెప్పాడు. అయితే బాలయ్య బాబు ఏజ్ పెరుగుతున్నా కూడా ఆయన మైండ్ సెట్ అనేది యంగ్ జనరేషన్ కి తగ్గట్టుగా ఉందని సింబాలిక్ గా చెప్పడానికే ఆయన యూత్ హీరోలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అంటూ మరికొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు.

నిజానికి బాలయ్య బాబు వరుసగా సినిమాలు చేస్తూ ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పుడు ఆ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఆయినప్పటికీ తన వాళ్ళ కోసం ఆయన ఎప్పుడైనా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్లకి హాజరవుతూ ఉంటాడు.

ఇక అందులో భాగంగానే విశ్వక్ సేన్ ను కూడా ప్రోత్సహిస్తూ మంచి గుర్తింపు రావాలనే విధంగా బ్లెస్ చేసి సినిమా సక్సెస్ అవ్వాలని తన అభిమానులు కూడా ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని కూడా ఆయన చెప్పడం విశేషం…ఇక ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు…