https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ ఫైనల్ ఔట్పుట్ నాకు కూడా సంతృప్తిని ఇవ్వలేదు..దిల్ రాజే అందుకు కారణం : శంకర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి ఎలాంటి ఫలితం వచ్చిందో మనమంతా చూసాము. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 15, 2025 / 11:28 AM IST

    Shankar

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి ఎలాంటి ఫలితం వచ్చిందో మనమంతా చూసాము. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించాడు. డైరెక్టర్ శంకర్ ఒకప్పటిలా కాదు, ఇప్పుడు ఆయన పూర్తిగా ఫామ్ కోల్పోయాడు అని తెలిసినప్పటికీ కూడా రామ్ చరణ్ ఆయన్ని నమ్మి ఈ చిత్రాన్ని చేసాడు. నిర్మాత దిల్ రాజు కూడా డబ్బులను మంచి నీళ్లు లాగా ఖర్చుపెట్టాడు. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ లోనూ ఆయన పెట్టిన రూపాయి కనిపించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. మేకింగ్ మీద పెట్టినంత శ్రద్ద స్క్రిప్ట్ మీద పెట్టి ఉండుంటే ఈ సినిమా నేడు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరేది. సినిమాలో అనేక సన్నివేశాలకు లాజిక్స్ ఉండవు. ఆడియన్స్ కి అది చాలా తేలికగా అర్థమైపోతుంది. ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని మాత్రమే అద్భుతంగా తీశారు.

    ఆ ఎపిసోడ్ ని కూడా చాలా తొందరగా ముగించేశారు. సెకండ్ హాఫ్ లో అధిక శాతం ఈ ఫ్లాష్ బ్యాక్ ని పెట్టుంటే మరో రంగస్థలం అయ్యేది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ఫలితం పై డైరెక్టర్ శంకర్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడాడు. విలేఖరి ఆయనని ఒక ప్రశ్న అడుగుతూ ‘ గేమ్ చేంజర్ చిత్రానికి చాలా నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. దీనిపైన మీ స్పందన ఏమిటి?’ అని అడగగా, దానికి శంకర్ సమాధానం చెప్తూ ‘నా దృష్టికి ఇప్పటి వరకు కేవలం పాజిటివ్ రివ్యూస్ మాత్రమే వచ్చాయి. వాస్తవానికి ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ నాకు సంతృప్తి ని ఇవ్వలేదు. నాకు ప్రతీ సినిమాలోనూ డిటైలింగ్ ఇవ్వడం అలవాటు. ఈ సినిమాకి కూడా అదే చేశాను. 5 గంటల ఫుటేజీ వచ్చింది. కనీసం మూడు గంటల ఫుటేజీ అయినా ఉండాలని చెప్పాను. కానీ దిల్ రాజు గారు మా తెలుగు సినిమాలు అంత పెద్దవి కూడా ఉండకూడదు సార్ అన్నాడు, ఇక తప్పలేదు, కుదించాము’ అంటూ చెప్పుకొచ్చాడు శంకర్.

    ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దాదాపుగా గంటకు పైగా ఉండదట. సినిమాలో కేవలం అరగంట మాత్రమే చూపించారు. ఈ ఎపిసోడ్ ని మరో 20 నిమిషాలు పెంచి ఉండుంటే సినిమా ఫలితం వేరే లెవెల్లో ఉండేది. రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చేది, అంత అద్భుతంగా చేసాడు ఈ సినిమాలో ఆయన. ఏది ఏమైనా నిర్మాత దిల్ రాజు చేసిన పొరపాటు వల్ల, వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాల్సిన ఈ సినిమా 200 కోట్ల రూపాయిలతోనే సరిపెట్టాల్సి వచ్చింది. పుష్ప 2 చిత్రం దాదాపుగా మూడు గంటల 20 నిమిషాల నిడివి ఉంటుంది. ప్రేక్షకులు దానిని అసలు పట్టించుకోలేదు. సినిమా బాగుంది కాబట్టి దుమ్ము లేపింది. ‘గేమ్ చేంజర్’ కి కూడా అదే ఫార్ములా ని అనుసరించాల్సింది