https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ ప్రాంతాల్లో మొదటి రోజుని మించిన 5వ రోజు వసూళ్లు..ఫ్లాప్ టాక్ తో మాస్ ర్యాంపేజ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని దక్కించుకొని అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 15, 2025 / 11:31 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని దక్కించుకొని అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి సెలవుల్లో విడుదలైన ఈ సినిమాకి సరైన పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేది. కానీ అది జరగలేదు. బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయాము అని అభిమానులు రోజు సోషల్ మీడియా లో డైరెక్టర్ శంకర్ ని తిట్టుకుంటున్నారు. కనీసం సంక్రాంతి పండుగ రోజైన ఈ సినిమాకి భారీ వసూళ్లు వస్తాయని అనుకున్నారు. ట్రేడ్ ఊహించినంత వసూళ్లు కాకపోయినా , పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను మాత్రం నిన్న ఈ చిత్రం సొంతం చేసుకుంది. కానీ ఆడియన్స్ మొదటి రెండు ఛాయస్ లు మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘డాకు మహారాజ్’ చిత్రాలే. ఈ రెండు సినిమాలకు టికెట్స్ దొరకని వాళ్ళు ‘గేమ్ చేంజర్’ కి వెళ్లారు.

    ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ కెరీర్ లో ‘గేమ్ చేంజర్’ చిత్రం మూడవ వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి, కమర్షియల్ గా డిజాస్టర్ రేంజ్ లో నిల్చిందంటే, ఈ సినిమా రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 5 రోజులకు గాను ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 18 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వసూళ్లు ఈ 5 రోజులకు వచ్చిందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఫుల్ రన్ లో 43 కోట్ల రూపాయలకు పైగా రావాలి, అది దాదాపుగా అసాధ్యమే. అదే విధంగా సీడెడ్ లో 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

    మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర లో 9 కోట్ల రూపాయిలు,గుంటూరు జిల్లాలో 6 కోట్ల 50 లక్షలు, కృష్ణ జిల్లాలో 4 కోట్ల 60 లక్షలు, 3 కోట్ల 50 లక్షలు, అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి 11 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులకు గాను 62 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక లో 4 కోట్ల 40 లక్షల రూపాయిలు, తమిళనాడు లో 3 కోట్ల 30 లక్షలు, నార్త్ ఇండియా లో 16 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 175 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.