Rajamouli and Mahesh Babu : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రాజమౌళి తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఆయన ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా మీద యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరికి మంచి అంచనాలైతే ఉంటాయి.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మీద యావత్ ప్రపంచం మొత్తం చాలా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు…ఇక రీసెంట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో చాలా రహస్యంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మరి వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమా కోసం పూర్తిగా తన మేకోవర్ ను మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సాధించే విజయంలో తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచబోతున్నాడనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటిస్తున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి ఈ సినిమా బడ్జెట్ వెయ్యి కోట్లుగా తెలుస్తోంది. మరి ఇంత భారీ బడ్జెట్ సినిమాలో అతను ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి అనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి మహేష్ బాబు ప్రతి సినిమాకి ముందుగా అడ్వాన్స్ తీసుకున్న తర్వాతే సినిమా సెట్ లో అడుగు పెడతాడు.
కానీ రాజమౌళి సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం అయితే అందరిలో ఉంది. కాబట్టి మహేష్ బాబు కూడా ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది అలాగే ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్లలో నుంచి 40% షేర్ మహేష్ బాబు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. అదే విషయాన్ని ప్రొడ్యూసర్స్ తో కూడా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకి 40% తీసుకుంటూనే రెండో భాగం పైన వచ్చే ప్రాఫిట్ లో కూడా 40% వాట తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట ఈ లెక్కన మహేష్ బాబు భారీ మొత్తంలో ఈ సినిమా మీద పర్సంటేజ్ ని పొందబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమా అంటే రెమ్యూనరేషన్ కంటే పర్సంటేజ్ తీసుకోవడమే బెటర్ అని హీరోలు అందరూ భావిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి మరోసారి మహేష్ బాబు కూడా అదే బాటలో వెళ్తుండటం విశేషం…