Anandayya Corona Medicine: గత సంవత్సరం కరోనా ఎంత ఫేమస్ అయ్యిందో ఆనందయ్య అంత ఫేమస్ అయ్యాడు అనే చెప్పాలి. ఈయన తయారు చేసిన కరోనా మందు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యింది. ఆనందయ్యా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కి చెందిన వాడు. సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య ఇచ్చే మందు కోసం కరోనా బాధితులు, వారి బంధువులతో పోటీ వాతావరణం నెలకొంది.

ఇంత జనాలను చూసి చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని మరి పంపిణీ చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒమోక్రాన్ కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా ఆనందయ్య మందు మరొకసారి తెర మీదకు వచ్చింది. ఇప్పుడు కూడా ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నాడు. అయితే ఆనందయ్య కు గ్రామస్థులు భారీ షాక్ ఇచ్చారు.
Also Read: Ap Government: ఎట్టకేలకు ఏకగ్రీవ పంచాయతీలకు మొక్షం.. రూ.134 కోట్లు విడుదల..
గత ఏడాది గ్రామస్తులంతా ఆనందయ్యను సపోర్ట్ చేసారు. ఐతే ఈ ఏడాది మాత్రం ఆనందయ్య మందును పంపిణీ చేయడానికి వీళ్లలేదని వ్యతిరేకిస్తున్నారు. సోమవారం కృష్ణపట్నం లో ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభించారు. ఐతే గ్రామస్థులు దీనిని వ్యతిరేకిస్తూ ఆనందయ్య కు భారీ షాక్ ఇచ్చారు. ఓమిక్రాన్ రాకముందే మందు పంపిణీ చేయడం ఏంటని గ్రామస్థులు ఆనందయ్య ను ప్రశ్నిస్తున్నారు.
ఈ మందు కోసం ఇతర గ్రామాల నుండి ప్రజలు వస్తున్నారని దీంతో లేని రోగం కూడా అంటుకుంటుంది ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆనందయ్య కు గ్రామస్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మందు పంపిణీ చేసేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని.. మందు పంపిణీ చేస్తే మీకు ఇబ్బంది ఏంటని గ్రామస్థులను ఆనందయ్య ప్రశ్నిస్తున్నాడు. ఈ గొడవ కాస్త పోలీసుల వరకు వెళ్లగా.. వారు ఆనందయ్య ను ఊరు చివర మందు పంపిణీ చేసుకోవాలి అని సూచించి నట్టు తెలుస్తుంది.